హీరో పక్కలో పడుకోవాల్సిందే: హీరోయిన్ బోల్డ్ కామెంట్

మీటూ ఉద్యమం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంత షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో మహిళా నటీమణుల విషయంలో హీరోలు, సినీ దర్శకులు, నిర్మాతలు చేసిన ఆగడాలపై ఒక్కొక్కరూ ఒక్కో సంగతి బయటపెట్టి సంచలనాలురేపారు. ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై ఎంతో మంది నటీమణులు తమ అనుభవాలు పంచుకున్నారు. చాలా మంది హీరోయిన్లు కేరీర్ కోసం తమ ఒళ్లును అమ్ముకొని స్టార్ లుగా ఎదిగారని చాలా మంది బయటపెట్టారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా […]

Written By: NARESH, Updated On : July 15, 2021 8:46 pm
Follow us on

మీటూ ఉద్యమం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎంత షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో మహిళా నటీమణుల విషయంలో హీరోలు, సినీ దర్శకులు, నిర్మాతలు చేసిన ఆగడాలపై ఒక్కొక్కరూ ఒక్కో సంగతి బయటపెట్టి సంచలనాలురేపారు. ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై ఎంతో మంది నటీమణులు తమ అనుభవాలు పంచుకున్నారు.

చాలా మంది హీరోయిన్లు కేరీర్ కోసం తమ ఒళ్లును అమ్ముకొని స్టార్ లుగా ఎదిగారని చాలా మంది బయటపెట్టారు. తాజాగా ఇదే విషయాన్ని బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా పంచుకుంది.

2004లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మల్లికా షెరావత్ ఆ తర్వాత పలు బోల్డ్ సినిమాల్లో నటించింది. పైగా ఆమెకు బోల్డ్ శృంగార హీరోయిన్ గా పేరు వచ్చింది. ఫక్తు రోమాంటిక్ సినిమాల్లోనే ఆమె నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమె కెరీర్ అనుకున్నంతగా సాగలేదు.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లికా షెరావత్ కొన్ని హాట్ కామెంట్స్ చేసింది. తెరవెనుక తాము అంగీకరించినట్లు ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని చెప్పుకొచ్చింది. ప్రతిభకు తగిన అవకాశాలు ఇవ్వలేదని.. కొందరు హీరోలు తమ కోరికలు తీర్చలేనందుకు అవకాశాలు రాకుండా చేశారని తెలిపింది. కెరీర్ లో సాగాలంటే హీరోతో గడపడం తప్పనిసరి అని తెలిపింది.

సినిమాల్లో బోల్డ్ సినిమాలు చేసినప్పుడు నిజజీవితంలో చేస్తే తప్పేంటని కమిట్ మెంట్ అడిగేవారని మల్లికా వాపోయింది. ఈ విషయంలో తాను దూరంగా ఉండటం వల్లే చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఇది సినిమా ఇండస్ట్రీలో జరుగుతోందని చెప్పుకొచ్చింది.