అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలతో పాటు ఓ చేదు విషయాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు ఈ ఫ్యామిలీ హీరో. అది శ్రీకాంత్ హీరోగా పీక్స్ లో ఉన్న సమయం. కెరీర్ లోనే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అయితే అలాంటి గోల్డెన్ పీరియడ్ లో ఒకే ఏడాది శ్రీకాంత్ నటించిన 7 సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.
అప్పటి సంగతులను గుర్తు తెచ్చుకుంటూ శ్రీకాంత్ ఎమోషనల్ అయ్యారు. శ్రీకాంత్ మాటల్లోనే ‘నాకు తెలుసు, ఒకే సంవత్సరం ఏడు సినిమాలు ప్లాప్ అయితే, ఏ హీరో అయినా టెన్షన్ పడతాడు. నాకు అయితే, ఇక నా కెరీర్ అప్పుడే ముగిసిందా అని భయపడ్డాను. హీరోగా నాకు హిట్లు ఇక రావా ?, నా సినీ ప్రయాణం ముగిసి పోయిందా ? అని అప్పుడు నాలో ఇలా ఎన్నో అనుమానాలు ఉండేవి.
కారణం ఒక్కటే.. నా సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదేమో అనే భయం. ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. అప్పుడు నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యాను. ఓ సందర్భంలో ఇలా అయితే కష్టమని తిరిగి మా ఊరెళ్లిపోవాలని ఆలోచించాను. ఊరిలో వ్యవసాయం చేసుకుని సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకున్నాను. అప్పుడు నా పరిస్థితి గమనించిన మెగాస్టార్ చిరంజీవి నన్ను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన ధైర్యం నాకు ఓదార్పునిచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్.