Homeక్రీడలుక్రికెట్‌Rohit Sharma: రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్

Rohit Sharma: రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్

Rohit Sharma: కొద్దిరోజులుగా హిట్ మాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి స్పోర్ట్స్ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. అయితే తన రిటైర్మెంట్ గురించి ఇంతవరకు రోహిత్ నోరు విప్పలేదు. అలాగని మేనేజ్మెంట్ కూడా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రధాన మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా వరకు రకరకాల ఊహాగానాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఎవరికి తోచింది వారు రాసుకుంటూ పోతున్నారు. ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటూ రకరకాల కథనాలను వండి వారుస్తున్నారు.

రోహిత్ శర్మ రిటైర్మెంట్ లార్డ్స్ వేదికగా జరుగుతుందని.. 2027 వన్డే వరల్డ్ కప్ లో తనకు చోటు ఇవ్వకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఇప్పటికే మేనేజ్మెంట్ కూడా అతనితో సంప్రదింపులు జరిగిందని.. అతని స్థానంలో జైస్వాల్ లేదా మరొక ఆటగాడిని ఓపెనర్ గా ఆడిస్తారని ప్రచారం మొదలైంది. దీనిపై క్లారిటీ ఇచ్చేవారు లేకపోవడంతో రకరకాల ప్రచారాలు సాగడం మొదలైంది.

రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు భారత క్రికెట్ కేంద్రం మండలి స్పందించింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగే మూడో వన్డే రోహిత్ శర్మకు చివరిది కాదని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. అందులో ఆడాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు. అతడి స్థానంలో జైస్వాల్ ను ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకు నేరుగా బీసీసీఐ కార్యదర్శి దేవదత్ సైకియా రంగంలోకి దిగారు. “రకరకాల వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా సుష్కమైనవి. రోహిత్ లార్డ్స్ మైదానంలో ఆడే మ్యాచ్ చివరిది అనే విషయంపై ఎటువంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో అతడు కీలక ఆటగాడు.. భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలలో అతడు కచ్చితంగా ఉంటాడు. ప్రణాళికలలో కూడా అతడికి సభ్యుడు లార్డ్స్ మైదానంలో జరిగే వన్డే మ్యాచ్ అందరికీ చివరిది కానే కాదు” అని దేవదత్ పేర్కొన్నారు..

రోహిత్ శర్మ మీద గౌతమ్ గంభీర్.. అజిత్ అగర్కర్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. మేనేజ్మెంట్స్ స్పందించింది. వారిద్దరి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా రోహిత్ వన్డే కెరియర్ రిటైర్మెంట్ కు సంబంధించిన వార్తలు ఆగిపోయాయి. టీమ్ ఇండియాకు టి20.. ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. అనేక సందర్భాలలో అతడు టీమ్ ఇండియాకు వన్డే వరల్డ్ కప్ అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. 2023లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్ళింది. నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయింది. అయితే తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి రోహిత్ మరో ఏడాది పాటు కెరియర్ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version