కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

కేంద్ర హోంశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్- 2000 సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 66 ఎ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్ కింద కేసులు […]

Written By: Velishala Suresh, Updated On : July 14, 2021 7:33 pm
Follow us on

కేంద్ర హోంశాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్- 2000 సెక్షన్ 66ఎ కింద నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 66 ఎ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్ కింద కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది.