
Lovers Viral Video : గతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే.. లవర్ ను మెయింటెయిన్ చేస్తే.. మూడో కంటికి తెలిసేది కాదు. కల్చర్ అప్డేట్ అయ్యింది. లవర్ లేకపోతే.. నామూషీగా చూడడం మొదలైంది. నెక్స్ట్ అప్డేట్ ఏమంటే.. ప్రియుడితో, ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకొని అందరి ముందూ తిరగడం ఫ్యాషన్ అయిపోయింది. అలా తిరగని వారిని లోకం తెలియని గొర్రెల్లా ట్రీట్ చేశారు. చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏమంటే.. లవర్ తో కలిసి అందరూ చూస్తుండగానే.. ముద్దులు కురిపించుకోవడం, పరిస్థితిని బట్టి ఎంత దూరమైనా వెళ్లడం! ఇదే.. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. కావాలంటే ఈ వీడియో చూడండి.. ట్రెండ్ నడవడం కాదు.. పరిగెడుతోందని మీరే అంటారు.
ఈ వ్యవహారం మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కనిపించింది. సినిమాల్లో హీరో హీరోయిన్లు చేయగాలేనిది.. మేం చేయలేమా? అనుకున్నారేమో నడుస్తున్న బైక్ పై ఎదురు బొదురుగా కూర్చొన్ని రొమాన్స్ లో మునిగిపోయారు ఇద్దరు లవర్స్. అతగాడు బండి నడుపుతుంటే.. ఆ ఘనత వహించిన ప్రియురాలు.. ఘాటు ప్రేమ కురిపిస్తోంది.
మరీ.. నడిరోడ్డుపై ఇలాంటి వ్యవహారం సాగిస్తుంటే.. ఈ కాలంలో చూస్తూ ఎవరుంటారు చెప్పండి? వెంటనే.. ఫోన్ కు పనిచెప్పారు. ఫలితంగా..ఈ వీడియో సోషల్ మీడియాలో వెయ్యి కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసింది. ఇలా మన చెంతకు కూడా వచ్చేసింది. న్యూస్ ఐటమ్ అయిపోయింది.
ఈ వీడియో చూసిన వాళ్లు పెట్టే కామెంట్లు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? మీరు ఏమనుకుంటున్నారో.. అంతకు మించి పది రెట్లు ఎక్కువగానే ఫైర్ అయిపోయారు నెటిజన్లు. కొందరు తిట్ల దండకం అందుకోగా.. మరికొందరు మాత్రం పోలీసులు అర్జెంటుగా వీరి పని పట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మోపున బండి మీద పోయే వారు ఎవరినైనా ఢీకొడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
దీనిపై స్థానిక పోలీసు అధికారి కూడా స్పందించారు. కనీసం హెల్మెంట్ కూడా లేకుండా ఇలా వ్యవహరించిన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి పనులు ఇంకెవరు చేసినా వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. చూద్దాం మరి.. పోలీసులు పట్టుకున్న వార్త ఎప్పుడొస్తుందో?
बदलते भोपाल का अदभुत नज़ारा (VIP road ) जहां पर मोहब्बत के स्टंट होते है। क्या आप ने देखा ऐंसा नज़ारा ?#Bhopal #MadhyaPradesh #lovebirds #viproadbhopal pic.twitter.com/gphKpwtfgX
— priyank kesharwani (@priyankkesharw1) September 6, 2021