Student kiss to Teacher Viral Video: మా చిన్నప్పుడు టీచర్లు కొడితే చేతివేళ్లపై వాతలు వచ్చేవి. వీపులన్నీ విమానం మోతమోగేవి. టీచర్లను చూస్తే ఉచ్చ పడిపోయేది. అలా దెబ్బతిన్న వారే ఇప్పుడు గొప్పగొప్పోళ్లు అయిపోయారు. టీచర్ల దండనను ఎదుర్కొన్నవారే బాగుపడ్డారు.బాగా చదివారు.

ఇప్పుడు పిల్లలపై దెబ్బ పడితే చాలు టీచర్లపైనే ఎదురుదాడులు చేస్తున్న పరిస్థితి.దీంతో పిల్లలకు చదువు వచ్చినా రాకపోయినా మనకేంటి అని టీచర్లు పట్టించుకోవడం లేదు.
అయితే ఈ టీచరమ్మ మాత్రం విద్యార్థులను సముదాయించిన తీరు ఇప్పుడు వైరల్ అయ్యింది. అల్లరి చేస్తున్న ఓ విద్యార్థిని అలిగి మరీ సాధించుకున్న వైనం హాట్ టాపిక్ గా మారింది..
ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో కానీ ఓ చిన్న పిల్లాడు తెగ అల్లరి చేస్తుంటే ఆ అందమైన లేడీ టీచర్ నొచ్చుకుంది. ఇక నీతో మాట్లాడను అంటూ అలిగింది.
అయ్యో టీచర్ అలిగిందని ఆ బుడ్డోడు వదిలిపెట్టలేదు. ఇకపై అల్లరి చేయబోనంటూ అలిగిన టీచర్ ను సముదాయించాడు. అంత చిన్నోడు టీచర్ ను అలా అనునయించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముద్దుముద్దుగా మాట్లాడుతూ టీచర్ కు ముద్దులు పెడుతూ ఇక అల్లరి చేయనంటూ బతిమిలాడిన వైనం ఆసక్తి రేపింది. టీచర్ కూడా చివరకు కోపం వీడి ఆ పిల్లాడికి ముద్దులు ఇచ్చి అల్లరి చేయకు అంటూ పంపిస్తుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/Gulzar_sahab/status/1569327422000230400?s=20&t=Evx4gYIjqxOh5BPXzjeicw