Khaki Web Series Story : సినిమాకు ప్రారంభం ముందు బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీస్ అనే డిస్క్లైమైర్ పడుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. కొన్ని కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రం నిజమైన కథలతో నిర్మితమయ్యాయి.. తెలుగులో ఈ మధ్య వచ్చిన క్రాక్, రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర… ఇంక చాలా సినిమాలు నిజ జీవితంలో జరిగిన కథలతోనే నిర్మితమయ్యాయి.. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఉంది.. ఇక సామాజిక మాధ్యమాల జోరు పెరిగిన తర్వాత ఓటిటిలు నిజ జీవిత కథలతో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నాయి. అలాంటి వెబ్ సిరీస్ ఖాకీ: దీ బీహార్ చాప్టర్. నిన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. సుమారు 6 గంటల నిడివి ఉన్న ఈ వెబ్ సిరీస్ నిజ జీవిత కథ నుంచి పుట్టుకొచ్చింది.
-24 మందిని చంపేశారు
బీహార్ రాష్ట్రంలో మినాపూర్ అనే గ్రామంలో ఒకేరోజు రాత్రి 24 మందిని చంపేశారు. ఆ హత్యలు చేసింది ఒకటే గ్యాంగ్. సూత్రధారి అశోక్ మహతో. బీహార్ నేర సామ్రాజ్యానికి అతడు ఒక కింగ్.. మీనాపూర్ గ్రామంలో ఒక గృహప్రవేశం జరుగుతుండగా పోలీస్ ఇన్ ఫార్మర్ అనే నేపంతో రామ్ దులార్ అనే వ్యక్తికి చెందిన 17 మంది కుటుంబ సభ్యులను అశోక్ మహతో పిట్టని కాల్చినట్టు కాల్చి పడేశాడు. అతడి గ్యాంగ్ లో ఉన్న వ్యక్తి రామ్ దులార్ ఇతడు కాదు అని చెప్పినా.. అశోక్ మహతో లో కొంచెం కూడా పశ్చాత్తాపం కలగలేదు. తనతో శత్రుత్వం లేకపోయినప్పటికీ ప్రాణం తీయడంలో మజా ఉంటుంది అనుకునే కిరాతకుడు అతడు..ఒక రకంగా చెప్పాలంటే స్పైడర్ సినిమాలో విలన్ తీరు మనస్తత్వంతో ఉంటాడు. నిజమైన రామ్ దులార్ పెళ్ళి వేడుకలో ఉంటే ఇక్కడికి వెళ్లిన అశోక్ మారణ హోమం సృష్టించాడు. ఏడుగురిని పొట్టన పెట్టుకున్నాడు. ఇందులో నాలుగు ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఒకే రోజు 24 మందిని హతమార్చాడు. ఈ విషయం తెలుసుకున్న నితీష్ కుమార్ అక్కడికి వచ్చారు.. మరి ముఖ్యంగా ఆ బుల్లెట్ల ధాటికి భయపడి ఒక నిండు చూలాలు, ఆమె కుమారుడు చనిపోయారు.. పాపం ఆ పిల్లాడు తన తల్లి కొంగు పట్టుకుని అలాగే ఉన్నాడు.. ఈ దృశ్యం చూసి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కన్నీరు పెట్టుకున్నాడు.. వెంటనే అక్కడి ఇన్స్పెక్టర్ ని, కలెక్టర్ ని, ఎస్పీ ని సస్పెండ్ చేశాడు.
-ఆ స్థానంలో యువ ఐపీఎస్
ఖాకీ వెబ్ సిరీస్ లో చూపించినట్టు ఆ ప్రాంతానికి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన యువ ఐపీఎస్ అమిత్ లోడా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు మరుసటి రోజు మీనాపూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ పరిస్థితులు మొత్తం అన్ని గమనించారు.. అశోక్ గురించి తెలుసుకున్నారు. అశోక్ స్వగ్రామం షేక్ పురా. అతడి తోటి పిల్లలు ఆడుకుంటూ ఉంటే… ఇతడు మాత్రం తొండల్ని చంపి ఆనందిస్తూ ఉండేవాడు.. రక్తం చూస్తే వెర్రి ఎక్కిపోయేవాడు.. ఒకసారి గ్రామానికి చెందిన భూస్వామి స్థలాన్ని కబ్జా చేయబోతే.. అతడు సర్వేశ్వర్ అనే దాదాతో అశోక్ ను కొట్టించాడు. ఈ కసితో అశోక్.. సర్వేశ్వర్ వ్యతిరేకి పంకజ్ సింగ్ గ్యాంగ్ లో చేరాడు. వాళ్ల సహాయంతో సర్వేశ్వర్ ను చంపాడు. తర్వాత పంకజ్ సింగ్ ను కూడా హతమార్చాడు. అక్రమ వ్యాపారాలపై పట్టు సాధించాడు.. బీహార్ వీరప్పన్ గా వినతి ఎక్కాడు.. పోలీసుల లెక్క ప్రకారమే 70 మంది దాకా చంపాడు.. పోలీసులను కూడా కొనేశాడు.. చాలామంది అతనికి ఇన్ ఫార్మర్లుగా పని చేసేవారు.
-పింటూ ను అరెస్టు చేశారు ఇలా
మీనాపూర్ హత్యల తర్వాత అశోక్ గ్యాంగ్ అజ్ఞాతంలోకి వెళ్ళింది. అశోక్ గ్యాంగ్ లో కీలకమైన పింటూ కూడా వారితోనే ఉన్నాడు. అయితే పింటూ భార్య రోజు ఫోన్ చేస్తూ ఉండేది.. త్వరగా ఇంటికి రా అని బతిమిలాడేది. ఈ సమయంలో పింటూ తన కొడుకుతో ఇంగ్లీష్ పేపర్ తెప్పించి చదివించాలని కోరేవాడు. ఎలాగైనా అతడు ఐపీఎస్ కావాలని పరితపించేవాడు.. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారి అమిత్.. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పింటూ భార్య జాడ కనుక్కున్నాడు. అక్కడే మాటు వేసిన అమిత్.. వారం తిరక్కుండానే భార్య దగ్గరకు వచ్చిన పింటూను అరెస్టు చేశాడు. అయితే పింటూను విడిపించాలని అశోక్ స్థానిక ఎమ్మెల్యే పై ఒత్తిడి తెచ్చాడు.. అశోక్ భయపడుతున్నాడు అని తెలుసుకున్న అమిత్… మరింత గందరగోళంలోకి నెట్టాలని.. అశోక్ గ్యాంగ్ లోని కొంతమంది పింటూ ను పట్టించారని విలేకరులతో చెప్పాడు.
-బీహార్ వీరప్పన్ ను పట్టుకున్నాడు
అశోక్ ఫోన్ ట్యా ప్ అవుతోందని పోలీసుల్లో ఉన్న తన ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకుని… స్విచ్ ఆఫ్ చేశాడు.. దీంతో అమిత్ డైలామా లో పడిపోయాడు. ఈ క్రమంలో పింటూ భార్య ఒకరోజు సంజయ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి నేను అశోక్ సాబ్ తో మాట్లాడాలి అని అనడం అమ్మితే విన్నాడు.. వెంటనే పోలీసులు సంజయ్ నెంబర్ ట్యాప్ చేశారు.. సంభాషణలు విన్నారు.. ఈ క్రమంలో ఒకరోజు సంజయ్ ఇక్కడ హైవే.. లారీల రొద ఎక్కువగా ఉంది. గట్టిగా మాట్లాడు అన్నాడు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నల్ హాటీ పట్టణం చూపింది. తర్వాత అనేక నాటకీయ పరిణామాల మధ్య అశోక్ ను అమిత్ పట్టుకున్నాడు. సీఎం సమక్షం లో కేసు నమోదు చేశారు. బహుశా దేశ చరిత్రలో ఒక క్రిమినల్ పై కేసు నమోదు చేయడం ఇదే మొదటి సారి. ఆ తర్వాత బెగుషేరాయ్ ప్రాంతానికి అమిత్ బదిలీ అయ్యారు. కానీ 2008లో ఒక గ్రెనేడ్ అమిత్ కుటుంబ సభ్యుల సమీపంలో పేలింది. అమిత్ కుమారుడికి తలకి గాయం అయింది. కొద్ది రోజులకు అమిత్ కు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఇప్పుడు ఈ స్టోరీ ఖాకీ వెబ్ సిరీస్ గా వచ్చింది. ఓటీటీ లో దుమ్ము రేపుతోంది. కాకపోతే నిడివి ఎక్కువ.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Khaki web series story the story of a bihar gangster who killed 24 people
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com