Adolescence Web Series : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…ఇంగ్లాండ్ దేశస్తులు ‘అడల్ సెన్స్’ అనే ఒక సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు…ఇక ఈ సిరీస్ కు నెట్ ఫ్లిక్స్ లో మంచి ఆదరణను దక్కించుకుంది… నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేస్తూ ముందుకు సాగుతుంది…ఇంతకీ ఈ సినిమాలో ఏముంది అనేది తెలుసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. అయితే ఈ సినిమా మొత్తాన్ని ఒకే షాట్ లో తీయడం అనేది ప్రధాన ఆకర్షణగా నిలిస్తే క్యారెక్టరైజేషన్స్ లో సినిమాటోగ్రఫీ ని హ్యాండిల్ చేసిన విధానంలో గాని స్క్రీన్ ప్లే లో గాని, ప్రతి పాత్రను డిజైన్ చేసిన విధానంలో గాని వాళ్ళు అద్భుతమైన కెపబులిటిని చూపించారు… ఈ సిరీస్ కి చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది.
Also Read : ఏ బంధమూ ఆమెకు పూర్తి ప్రేమ ఇవ్వలేదు.. కొత్త తోడు వెతుక్కోవడంలో తప్పేముంది?
మూడు ఎపిసోడ్స్ తెరకెక్కిన ఈ సిరీస్ లో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ప్రేక్షకుడిని హత్తుకునే విధంగా ఉంటుంది. అందువల్లే ఈ సిరీస్ కి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ అయితే లభిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సిరీస్ ని చూసిన ప్రతి ఒక్కరూ మిగతా కొంతమందికి కూడా సజెస్ట్ చేస్తూ దీనిని చూడమని చెబుతున్నారంటే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ఈ సినిమాలో ఉన్న మెసేజ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని ఉద్దేశ్యంతో యూకే లో ఉన్న ప్రతి స్కూల్లో ఈ సిరీస్ ని ప్లే చేస్తాం అంటూ అక్కడి పీఎం స్టార్మర్ ప్రకటించారు…ఇక మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఇలాంటి సిరీస్ రాలేదంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం ఈ సిరీస్ ని కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడని వారు ఎవరైనా ఉంటే కచ్చితంగా ఈ సిరీస్ ని చూడాలని కూడా ప్రతి ఒక్కరూ చెబుతూ ఉండటం విశేషం…
నెట్ ఫ్లిక్స్ లో కంటెంట్ ఒకటి వచ్చిందంటే అందులో ఏదో ఒక విషయం అయితే ఉంటుందని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సిరీస్ లో మంచి కంటెంట్ ఉండడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ మరోసారి మంచి సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో వాళ్ల మీద బాధ్యత పెరిగింది అంటు కొంతమంది నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…
Also Read : రికార్డు రేటుకు అమ్ముడు పోయిన రామ్ చరణ్ ‘పెద్ది’ ఆడియో రైట్స్..!