India vs New Zealand 2nd Odi: 0, 7, 2, 2, 1.. ఇవీ న్యూజిలాండ్ టాప్ 5 బ్యాట్స్ మెన్ చేసిన పరుగులు. ఒకానొక దశలో 50 పరుగులకే ప్యాకప్ అవుతుంది అనుకున్న దశలో చచ్చి చెడి 108 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. హైదరాబాద్ లో 300 మించి పరుగులు చేసిన కివీస్ 108 కే ఆల్ ఔట్ అవడం నిజంగా ఆశ్చర్యకరమే.

టాస్ గెలిచి..
హైదరాబాద్ వన్డేలో మూడు వందలకు మించి స్కోర్ చేసినా న్యూజిలాండ్ దాదాపు గెలిచినంత పని చేయడంతో టాస్ గెలిచిన ఇండియన్ టీం కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట్లో ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పు పట్టారు. బ్యాటింగ్ కు స్వర్గధామం లాంటి పిచ్ లో మొదట బ్యాటింగ్ ఉంచుకుంటే బాగుండేదన్నారు. కానీ అతడి నిర్ణయం సరైందని షమీ తొలి ఓవర్ లోనే నిరూపించాడు. మొదటి ఓవర్ ఐదో బాల్ కే ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేసి షాక్ ఇచ్చాడు.ఇక సిరాజ్ కూడా షమీ ఇచ్చిన ఆరంభాన్ని కొనసాగించాడు. నికోలస్ వికెట్ తీసి కివీస్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. 6 ఓవర్ల లోపే రెండు కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కాన్వే, మిచెల్, లాథమ్ ఇలా వచ్చిన బ్యాట్స్ మెన్ వచ్చినట్టే వెను తిరగడంతో 10.3 ఓవర్లకు 15 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది.

ఆ మ్యాజిక్ పని చేయలేదు
ఈ దశ లో క్రిజ్ లోకి వచ్చిన ఫిలిప్స్, బ్రేస్ వెల్ ఇన్నింగ్స్ చక్క దిద్దే ప్రయత్నం చేశారు. కానీ కుదురుకుంటున్న ఈ జోడిని షమీ విడదీశాడు. వీరు కనుక బ్యాట్ ఝుఖిపించకపోయి ఉంటే కివీస్ కథ మరోలా ఉండేది. తర్వాత వచ్చిన శాంట్నర్ కొద్ది సేపు బ్యాట్ కు పని చెప్పాడు. కానీ అతడు కూడా ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ వెంట వెంటనే అవుట్ కావడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 108 పరుగుల వద్ద ముగిసింది. మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ వెన్ను విరిచాడు. హార్దిక్, సుందర్ రెండేసి వికెట్లు, సిరాక్, ఠాకూర్, కుల దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీశారు.