Man Survives On Sea: చిన్న ప్రమాదం జరిగితే భయానికి గుండె ఆగి చచ్చిపోతుంటారు. కానీ అతడు ఏకంగా 24 రోజులు సముద్రంలోనే గడిపాడు. దినమొక యుగంగా ఆపన్న హస్తం కోసం ఎదురు చూసినా అతడికి ఎవరు కనిపించలేదు. దీంతో సముద్రంలోనే కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ సాయం కోసం తాపత్రయపడ్డాడు. వర్షపు నీటిని తాగుతూనే రోజులు గడిపాడు. అలల ధాటికి తీరం నుంచి కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ఏకంగా ఇరవై నాలుగు రోజులు నరకం అనుభవించాడు. తిండి లేక అల్లాడాడు. కాపాడే వారు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాం గడిపాడు.

గార్లిక్ పౌడర్ తింటూ వర్షపు నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. డొమినికాకు చెందిన ఎల్విన్ ప్రాంకోయిన్ డిసెంబర్ లో తన బోటుతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయాడు. సముద్రంలో ఇరవై నాలుగు రోజులు భయపడుతూ కాలం వెళ్లదీశాడు. అటుగా విమానం వెళ్లడంతో అతడికి బతుకు మీద కొంత ఆశ కలిగింది. వారికి అద్దం సాయంతో సిగ్నల్ ఇవ్వడంతో వారు అతడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఇలా తనకు ఇక భూమి మీద నూకలు చెల్లాయని అనుకున్న అతడిని ప్రాణాలతో కాపాడంతో ఊపిరిపీల్చుకున్నాడు.
సముద్రంలో ఒంటరిగా అన్ని రోజులు ఉండటం అంటే అతడికి ఎంతో ధైర్యం ఉంది. అన్ని రోజులు ప్రాణాలు కాపాడుకుని బతుకు జీవుడా అంటూ ఎవరైనా కాపాడాలని ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో రోజుల తరబడి రక్షించే వారి కోసం ప్రయత్నించాడు. ఒక్కడు కావడంతో భయంతో వణికిపోయాడు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ చివరి క్షణంలో విమాన సిబ్బంది రావడంతో బతికి బయటపడ్డాడు. ఇలాంటి ఘటనలు మనకు కూడా భయం కలిగిస్తాయి.

ఈ క్రమంలో ఎల్విన్ తనకు ప్రాణాల మీద ఆశ ఉండటంతోనే అన్ని రోజులు ఎదురు చూశాడు. విమానం కనుక రాకపోతే అతడికి ప్రాణాలు దక్కేవి కావు. దీంతో అతడిని రక్షించిన విమాన సిబ్బందిని చూసి ఉద్వేగానికి గురయ్యాడు. తనను ప్రాణాలతో కాపాడిన వారిని హత్తుకుని ఏడ్చాడు. ఏదేమైనా ప్రాణాలు కాపాడుకుని చిరంజీవిగా మిగిలాడు. మృత్యుంజయుడిగా మారిన అతడిని అందరు ప్రశంసలతో ముంచెత్తారు. పిరికివాడైతే ఎప్పుడో చచ్చిపోయేవాడని చర్చించుకుంటున్నారు. సముద్రంలో అన్ని రోజులు ఉండటమంటే మాటలు కాదు.