Allu Arjun new movie update: ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రాజమౌళి(SS Rajamouli) తర్వాత పాన్ ఇండియా లెవెల్ బిగ్గెస్ట్ బ్రాండ్ ఏదైనా ఉందా అంటే, అది అల్లు అర్జున్(Icon Star Allu Arjun) బ్రాండ్ మాత్రమే. ప్రస్తుతం ఆయన ఎంజాయ్ చేస్తున్న స్టార్ స్టేటస్ కి ఇండియా లో ఏ టాప్ డైరెక్టర్ అయినా అల్లు అర్జున్ తో ఒక సినిమా చెయ్యాలని కోరుకుంటారు. రీసెంట్ గానే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడు అల్లు అర్జున్. ఇక మరో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబై లో జరుగుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి చిత్రం చేయబోతున్నాడు అనేదానిపై ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చలు నడుస్తున్నాయి. చాలా కాలం నుండి బోయపాటి శ్రీను అల్లు అర్జున్ తో ఒక సినిమా చెయ్యాలని చూస్తున్నాడు.
గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘సరైనోడు’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటి సినిమా తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే ఒక మంచి కథ సిద్ధం చేయండి, మీతో ఎప్పుడైనా సినిమా చేయడానికి నేను రెడీ అని అల్లు అర్జున్ బోయపాటి శ్రీను కి మాట ఇచ్చాడు. ఇప్పుడు ఆ మాట ని నెరవేర్చే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే బోయపాటి శ్రీను ముంబై కి వెళ్లి అల్లు అర్జున్ కి ఒక స్టోరీ ని వినిపించి వచ్చాడట. ఆ స్టోరీ అల్లు అర్జున్ కి కూడా చాలా బాగా నచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ని రెడీ చేయమని చెప్పాడట.
ఈ వార్త తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్ వణికిపోతున్నారు. బోయపాటి శ్రీను మంచి కామెరిసిల్ మాస్ డైరెక్టర్, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ ఇప్పుడు అసలు ఫార్మ్ లో లేరు అనేది అభిమానుల వాదన. ఆయన గత చిత్రం ‘అఖండ 2’ భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కేవలం బాలయ్య కి మాత్రమే బోయపాటి సూట్ అవుతాడు అనుకుంటే, బాలయ్య కి కూడా ఆయన ఫ్లాప్ ఇచ్చేసాడు. ఇక స్టార్ హీరోస్ కి అయితే బోయపాటి అసలు సరిపోడు, కాబట్టి అల్లు అర్జున్ అతనికి దూరంగా ఉంటేనే మంచిది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు. కానీ ఒక్కసారి అల్లు అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే, వెనక్కి వెళ్లే రకం కాదు అనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆయన బోయపాటి తో కచ్చితంగా ఈ చిత్రం చేసేలాగానే ఉన్నాడు. ఈ సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించనుంది.