Sleep Tips: మనకు నిద్ర లేకపోతే ఇబ్బందులే. నిద్ర లేమితో అనేక సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడితో నిద్ర సరిగా పట్టదు. మనకు కంటి నిండా నిద్ర పడితే ఏ రోగాలు రాకుండా ఉంటాయి. కొందరికి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటితోనే ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారు. దీంతో నిద్ర సరిగా పోకపోతే అనారోగ్యం వస్తుంది. అవయవాలు సరిగా పనిచేయవు. నిద్ర సరిగా పట్టకపోతే ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. చికాకు వస్తుంది. కొందరైతే నిద్రమాత్రలు వేసుకుంటారు. రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

ప్రతి రోజు మంచి నిద్ర పోవాలంటే ధ్యానం చేయడం మంచి అలవాటు. రోజు కొంత సేపు ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతత వస్తుంది. తద్వారా నిద్ర పట్టడానికి ప్రధాన కారణంగా నిలుస్తుంది. 15-20 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఎంతో ప్రయోజనం. ఒత్తిడి దూరమవుతుంది. ఆందోళన లేకుండా పోతుంది. ఆలోచనలు మంచిగా రావడంతో మంచి నిద్ర సొంతమవుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే సరి. దీనికి అందరు మొగ్గు చూపాల్సిందే. నిద్రలేమిని దూరం చేసుకోవాల్సిందే.
మనకు సరిగా నిద్ర పట్టాలంటే లావెండర్ నూనె కూడా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు దీని వాసన పీల్చినా నిద్ర పట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంకా కొన్ని చుక్కలు నీళ్లలో వేసుకుని వాటితో స్నానం చేసినా నిద్ర పడతుంది. మనం తీసుకునే ఆహారాల్లో మెగ్నిషియం ఉండే వాటిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. గోధుమలు, బచ్చలికూర, డార్క్ చాక్లెట్, పెరుగు, అవకాడోల్లో మెగ్నిషియం పుష్కలంగా లభిస్తుంది. దీంతో రోజకు కనీసం 400 మి.గ్రా. పొటాషియం తీసుకోవడం వల్ల గాఢమైన నిద్ర పడుతుంది.

నిద్ర బాగా పట్టేందుకు జీవన శైలి మార్చుకోవాలి. కెఫిన్, మద్యం, మద్యపానం వంటి వాటిని తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. శరీరానికి ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. వెన్నంటుకుంటూనే కన్నంటుకోవాలి. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు సుఖమైన నిద్ర పోతేనే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకే ఈ టిప్స్ పాటించి గాఢమైన నిద్ర పోయేందుకు మార్గాలు చూసుకోవాలి. లేదంటే భవిష్యత్ లో ఇబ్బందులు రాక మానవు. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది.