Site icon OkTelugu

Vijay Deverakonda ex girlfriend: రష్మిక కంటే ముందు ఆ అమ్మాయితో విజయ్ దేవరకొండ ప్రేమాయణం..? వెలుగులోకి వచ్చిన నిజాలు!

Vijay Deverakonda Controversy With Star Heroes

Vijay Deverakonda Controversy With Star Heroes

Vijay Deverakonda ex girlfriend: నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందాన(Rashmika Mandanna) పెళ్లి ఈ నెల 26 న జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్నీ రష్మిక కూడా దాదాపుగా ఖరారు చేసినట్టే. ఎలా అంటే రీసెంట్ గానే ఆమె విమానాశ్రయం లో కనిపించింది. ఆమె రాగానే మీడియాకు చెందిన వాళ్ళు, అభిమానులు చుట్టుముట్టారు. రష్మిక వైపు చూస్తూ ‘కంగ్రాట్స్ మేడం’ అని ఒక అభిమాని పెద్దగా అరుస్తాడు. దానికి రష్మిక ‘దేనికిరా కంగ్రాట్స్?’ అని అడగ్గా, ‘ఏ నెల 26న మీ పెళ్లి జరగబోతుంది కదా, అందుకు’ అని అంటాడు. అందుకు రష్మిక నవ్వుతూ తలదించుకుని వెళ్ళిపోయింది. ఒకవేళ సోషల్ మీడియా లో ప్రచారమైన వార్త అబద్దం అయితే రష్మిక అక్కడే ఖండించి ఉండేది, కానీ అది జరగలేదు, మౌనం అర్థాంగీకారం కాబట్టి వీళ్ళు నిజంగానే 26 న పెళ్లి చేసుకోబోతున్నారు.

ఇదంతా పక్కన పెడితే రష్మిక కంటే ముందు విజయ్ దేవరకొండ ఒక అమ్మాయి తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలాడట. ఆ అమ్మాయి పేరు వర్జీనియా. ఈమె బెల్జియం దేశానికి చెందిన అమ్మాయి. ఎలా విజయ్ దేవరకొండ జీవితం లోకి వచ్చిందో తెలియదు కానీ వచ్చేసింది. వీళ్ళ మధ్య మంచి మొదట్లో మంచి స్నేహ బంధం ఉండేది. తర్వాత ఆ స్నేహ బంధం కాస్త ప్రేమగా మారింది. ఎంత గాఢమైన ప్రేమంటే, వర్జీనియా లేకుండా విజయ్ దేవరకొండ బయటకు అడుగుపెట్టేవాడు కూడా కాదట. ‘పెళ్లి చూపులు’ మూవీ లో కూడా ఈమె నటించింది. ఈ సినిమాలో ఒక యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ లో విజయ్ దేవరకొండ కి చెక్కు ఇచ్చే ఉద్యోగిగా ఆమె ఒక చిన్న పాత్రలో కనిపిస్తుంది. ఈ విషయాన్నీ అప్పట్లో ఎవ్వరూ గుర్తించలేదు . వర్జీనియా తో విజయ్ దేవరకొండ క్లోజ్ గా ఉన్న ఫోటోలను మీరు క్రింద చూడొచ్చు.

వర్జీనియా కేవలం విజయ్ దేవరకొండ కి మాత్రమే కాదు , ఆయన కుటుంబం తో కూడా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తూ వచ్చేది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, వీళ్ళ మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. అవి పెద్ద గొడవలకు దారి తీశాయి. దీంతో విజయ్ దేవరకొండ నటంచిన ‘నోటా’ మూవీ విడుదల సమయం లో వీళ్లిద్దరికీ బ్రేకప్ జరిగిందని టాక్. విజయ్ దేవరకొండ సినీ ఇండస్ట్రీ లో రాణించడానికి వర్జీనియా ఇచ్చిన ప్రోత్సాహం మామూలుది కాదు. ఒక విధంగా విజయ్ దేవరకొండ ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణమే ఆమె. అలాంటి వర్జీనియా తో బ్రేకప్ చేసుకోవడం విజయ్ దేవరకొండ దురదృష్టం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version