Site icon OkTelugu

Brian Bennett catch : గాల్లో పక్షి లాగా ఎగిరి బంతిని అందుకున్నాడు.. జాంటీ రోడ్స్ నీకు కజినా భయ్యా!

Brian Bennett catch

Brian Bennett catch : టి20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ఫీల్డర్లు ఎవరు అనే ప్రశ్న ఎదురైనప్పుడు కచ్చితంగా లభించే సమాధానం ఫిలిప్స్. న్యూజిలాండ్ జట్టు తరఫున ఆడుతున్న ఇతడు అతి కష్టమైన క్యాచ్ లు పట్టి.. అందరిని ఆశ్చర్యంలో ముంచేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ను పట్టిన ఫిలిప్స్.. ఫీల్డింగ్ లో సరికొత్త ప్రమాణాలకు శ్రీకారం చుట్టాడు. అతడు ఆ క్యాచ్ కొట్టిన తర్వాత విరాట్ కోహ్లీ నమ్మశక్యం కాకుండా ఉందని తనలో తానే మాట్లాడుకుంటూ పెవిలియన్ వెళ్లిపోయాడు…

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఫిలిప్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా.. జాంటీ రోడ్స్ కూడా అభినందించే విధంగా ఓ ఆటగాడు క్యాచ్ పట్టాడు. తద్వారా టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫీల్డర్ గా అవతరించాడు. అంతేకాదు ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యుత్తమమైన క్యాచ్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.

అలాంటి క్యాచ్ అందుకున్న ఆటగాడి పేరు బ్రయాన్ బెన్నెట్. ఇతడిది జింబాబ్వే. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సోమవారం ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఇతడు. కళ్ళు చెదిరే విధంగా క్యాచ్ పట్టాడు. ఒమన్ జట్టు ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో బ్రాడ్ ఎవాన్స్ 20 వ ఓవర్ వేశాడు. ఈ సమయంలో ఒమన్ బ్యాటర్ నదీమ్ ఖాన్ బంతిని గట్టిగా కొట్టాడు. అది కాస్త గాల్లోకి ఎగిరింది.

మిడ్ వికెట్ లో ఫీల్డ్ చేస్తున్న బెన్నెట్ అమాంతం పరుగులు తీసుకుంటూ వచ్చాడు. గాలిలో పక్షి మాదిరిగా ఎగిరాడు. ముందుకు దూకి బంతిని అందుకున్నాడు. దీంతో నదీమ్ నిరాశతో వెళ్లిపోయాడు. ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్లలో ఇదే అత్యుత్తమమైన క్యాచ్. దీంతో ఒక్కసారిగా బెన్నెట్ సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయాడు. చాలామంది అతను క్యాచ్ పట్టిన విధానాన్ని చూసి.. రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. జాంటీ రోడ్స్ మీ కజినా భయ్యా అంటూ.. సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్లో ఒమన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 19.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. మహమ్మద్ (25), వినాయక్ శుక్ల (28) టాప్ స్కోరర్ లుగా నిలిచారు. రిచర్డ్ నగర్వ, ముజరాబాని, ఏవాన్స్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన జింబాబ్వే జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. సూపర్ క్యాచ్ పట్టిన బెన్నెట్ ఓపెనర్ గా వచ్చాడు. 38 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వికెట్ కీపర్ టైలర్ 31 పరుగులు చేశాడు. ఒమన్ జట్టు సంచలనం సృష్టిస్తుంది అనుకుంటే.. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్లో విఫలమైంది.

Exit mobile version