spot_img
Homeక్రీడలుక్రికెట్‌T20 World Cup Pakistan: అనుభవించండ్రా పాకిస్తాన్ క్రికెటర్లూ.. మీకు ఇది కావాల్సిందే

T20 World Cup Pakistan: అనుభవించండ్రా పాకిస్తాన్ క్రికెటర్లూ.. మీకు ఇది కావాల్సిందే

T20 World Cup Pakistan: ఫైవ్ స్టార్ హోటల్.. కట్టుదిట్టమైన భద్రత.. కోరుకున్న ఆహారం.. అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్న జిమ్.. అత్యంత విలాసవంతమైన బస్సు.. వీటన్నిటికీ మించి అభిమానుల సపోర్టు.. ఇన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి.. భారత జట్టుతో మ్యాచులు ఆడాలని విదేశీ ప్లేయర్లు ఉత్సాహపడుతుంటారు. చివరికి ఐపీఎల్ లో కూడా తమను కొనుగోలు చేయాలని.. తాము భారత గడ్డమీద ఆడాలని భావిస్తుంటారు.

కుక్క తోక వంకర అన్నట్టు.. ప్రపంచ జట్లలో ఆటగాళ్లు భారత గడ్డమీద అడుగు పెట్టాలని.. భారత జట్టుతో పోటీపడాలని భావిస్తుంటే.. పాకిస్తాన్ ప్లేయర్లు మాత్రం భిన్నంగా ఆలోచిస్తుంటారు. భారత గడ్డమీద భద్రత ఉండదని.. భారత జట్టుతో తాము ఆడబోమని చెబుతుంటారు. అంతేకాదు, టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియాతో మ్యాచ్ ఆడేది లేదని నిన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పిన విషయం కూడా తెలిసింది. ఈ క్రమంలో ఒక వీడియో సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రాచుర్యంలో ఉంది. అది కాస్త పాకిస్తాన్ ప్లేయర్ల దుస్థితిని.. వారి దుర్బలత్వాన్ని బయటపెడుతోంది.

టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ జట్టు మొత్తం శ్రీలంకలోని కొలంబో వేదికగా మ్యాచ్ లు ఆడుతోంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు పాకిస్తాన్ ప్లేయర్లకు కల్పించిన సౌకర్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాచుర్యంలో ఉంది. పాకిస్తాన్ క్రికెటర్లకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఒక మామూలు హోటల్లో బస కల్పించింది. వారు ఒక బస్సులో గ్రౌండ్ వద్దకు వచ్చారు. అక్కడికి వారు వస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. వారంతా కూడా ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి వస్తున్నట్టుగా ఉంది. దీనిని బలపరిచే వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది.

“భారత గడ్డమీద ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. భారత అండర్-19 జట్టుకు ఆడే ప్లేయర్లకు కూడా ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. కనీసం ఆ స్థాయి సౌకర్యాలు కూడా శ్రీలంకలో లేవు. భారత గడ్డమీద ఆడాలని కోరితే లేని పోని పంతాలకు పోయారు. చివరికి ఒక మామూలు హోటల్లో ఉంటున్నారు. ఇంతకు మించిన దరిద్రం మరొకటి ఉండదు. పాకిస్తాన్ ప్లేయర్లూ.. మీకు ఇది కావాల్సిందే. అనుభవించండి” అంటూ సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper
Exit mobile version