Gujarath : ఆత్మాభిమానానికి ప్రతీకలు మహిళలు. వారి మౌనం కొంతవరకే. ఎదురుతిరిగారంటే అపర కాళికలే. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఆకతాయి యువకుడి చేష్టలతో విసిగివేశారిపోయిన అక్కాచెల్లెళ్లు నడిరోడ్డుపైనే యువకుడికి నరకం చూపించారు. దేహశుద్ధి చేశారు. స్థానికులు వారికి సాయం చేయడంతో ఆ యువకుడికి దబిడదిబిడే అయ్యింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విజయ్ సర్కారే అనే యువకుడు అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు యువతులను ఏడిపించేవాడు. రోజూ వెంటపడి వేధించేవాడు. శృతిమించి వ్యవహరించేవాడు. అయినా సరే మౌనంగా భరించారు. ఓ రోజు ఆ ఇద్దరిలో ఒకరికి ముద్దుపెట్టాడు. దీంతో కోపోద్రిక్తులైన ఆ ఇద్దరు యువతులు అపర కాళికలుగా మారారు. యువకుడ్ని రోడ్డుపై పడేసి ఇష్టారీతిలో కొట్టిపారేశారు. అందులో ఓ యువతి బెల్ట్ తో విచాక్షణారహితంగా కొట్టింది. ఆ యువకుడిపై ఉన్న ఆగ్రహాన్ని తన చేతల ద్వారా చూపించింది. అటువైపు గా వెళుతున్న వారు సైతం తలోచేయి వేయడంతో యువకుడి పలాయనం చిత్తగించాడు.
అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తోంది. నేటి యువతులతో పెట్టుకుంటే సినిమా అలానే ఉంటుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో ఆడపిల్లలు ఇలా ఉంటేనే బతకలగలరు.. లేకుంటే అలాంటి వెధవలు రాజ్యమేలుతారు.. వారికి ఇలానే బుద్ధి చెప్పాలంటూ ఎక్కువ మంది వ్యాఖ్యానించారు. ఆకతాయి యువకుడిపై దాడిచేసిన యువతులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Female students confront harasser, beat him with belts in Ahmedabadhttps://t.co/ttoSnTw06H pic.twitter.com/b4WMzsXwbl
— DeshGujarat (@DeshGujarat) June 23, 2023
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Gujarati girl and boy on road viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com