Dimple Hayati – Venu Swami : తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా వేణు స్వామి పేరు మారుమ్రోగుతుంది. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వేణు స్వామి ఫేమస్ అయ్యాడు. హీరోలు, హీరోల భవిష్యత్ ఇదంటూ వేణు స్వామి చేసే కామెంట్స్ సంచలనం రేపుతుంటాయి. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టింది. పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పాడు. రామ్ చరణ్ కూతురుది గొప్ప జాతకం, కీర్తిలో చరణ్, ఉపాసనలను మించిపోతుందని చెప్పాడు. అదే సమయంలో ఆమె చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని వెల్లడించారు.