https://oktelugu.com/

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్… అఖండ 2 వచ్చేస్తుంది!

Akhanda 2: బాలయ్యకు అఖండ చాలా స్పెషల్. ఆయనను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం అది. ఏళ్ల తరబడి బాలయ్య విజయం కోసం ఎదురు చూశారు. వరుస పరాజయాలతో బాలయ్య మార్కెట్ దారుణంగా దెబ్బతింది. అఖండ ముందు చిత్రం రూలర్ వసూళ్లు టైర్ టూ హీరోల ఫ్లాప్ సినిమాల కంటే దారుణం. అసలు బాలయ్య తిరిగి పంజా విసురుతాడా? లేక ఫేడ్ అవుట్ అయిపోతారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. ఆ టైం లో బాలయ్య బోయపాటి శ్రీనును […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2023 / 11:47 AM IST
    Follow us on

    Akhanda 2

    Akhanda 2: బాలయ్యకు అఖండ చాలా స్పెషల్. ఆయనను సక్సెస్ ట్రాక్ ఎక్కించిన చిత్రం అది. ఏళ్ల తరబడి బాలయ్య విజయం కోసం ఎదురు చూశారు. వరుస పరాజయాలతో బాలయ్య మార్కెట్ దారుణంగా దెబ్బతింది. అఖండ ముందు చిత్రం రూలర్ వసూళ్లు టైర్ టూ హీరోల ఫ్లాప్ సినిమాల కంటే దారుణం. అసలు బాలయ్య తిరిగి పంజా విసురుతాడా? లేక ఫేడ్ అవుట్ అయిపోతారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. ఆ టైం లో బాలయ్య బోయపాటి శ్రీనును నమ్ముకున్నారు. వీరిది హిట్ కాంబినేషన్. సింహా మూవీతో మొదలైన వీరి జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది.

    బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ భారీ విజయాలు సాధించాయి. బాలయ్య కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. బాలయ్య ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చిన అఖండ మూవీ సీక్వెల్ వస్తుందంటూ ప్రచారం మొదలైంది. దీనికి ఎంతో సమయం లేదు. బాలయ్య జన్మదినం నాడు అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. జూన్ 10న అఖండ 2 ప్రాజెక్ట్ ప్రకటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

    ప్రస్తుతం బాలయ్య దర్శకుడు అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్నారు. బాలయ్య 108వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఆల్రెడీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కార్మిక నాయకుడిలా ఉద్యమ సారధిలా ఉన్న బాలయ్య లుక్ కేక అని చెప్పాలి. దర్శకులను పరుగులు పెట్టించే బాలయ్య మరో మూడు నాలుగు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తారట. అనిల్ రావిపూడి కూడా చకచకా చిత్రాలు తీసే డైరెక్టర్. ఆయన మహేష్ మూవీ సరిలేరు నీకెవ్వరు నెలల వ్యవధిలో పూర్తి చేసి విడుదల చేశారు.

    Akhanda 2

    ఇక బోయపాటి హీరో రామ్ తో చేస్తున్న మూవీ చిత్రీకరణ కూడా ఒక కొలిక్కి వచ్చిందట. ఈ క్రమంలో ఈ ఏడాదే అఖండ 2 పనులు ప్రారంభం కానున్నాయట. బాలయ్య జన్మదినం నాడు ప్రకటన, అనంతరం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. ఇది బాలయ్య ఫ్యాన్స్ లో జోష్ నింపే సమాచారం అనడంలో ఎలాంటి సందేహం లేదు.