Mahesh Babu- Namrata
Mahesh Babu- Namrata: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంటలలో ఒకటి మహేష్ – నమ్రత జంట. వీళ్లిద్దరు కలిసి అప్పట్లో వంశీ అనే చిత్రం లో నటించారు. ఆ సినిమా అప్పట్లో సరిగా ఆడలేదు కానీ వీళ్ళిద్దరినీ మాత్రం ఒకటి చేసింది. అప్పటికే నమ్రత బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్. పాపులారిటీ విషయం లో మహేష్ బాబు కంటే ఎక్కువ, వయస్సు లో కూడా మహేష్ బాబు కంటే 5 సంవత్సరాలు పెద్ద.మహేష్ ని పెళ్లాడిన తర్వాత ఆమె సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చింది.
అది కూడా మహేష్ కారణంగానే, పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలి అని మహేష్ పెట్టిన ఒక స్ట్రిక్ట్ కండిషన్ తర్వాత పెళ్లి చేసుకున్నాడట. అప్పటి నుండి ఆమె సినిమాలకు దూరంగా , మహేష్ చేస్తున్న వ్యాపారాలను మరియు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ కాలం గడిపేస్తుంది.
అయితే ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో నమ్రత శిరోద్కర్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తుంది.సినిమా కథని మలుపు తిప్పే పాత్రలో నమ్రత శిరోద్కర్ కనిపించబోతుందట. అయితే ఈ పాత్రని చేయాల్సిందిగా త్రివిక్రమ్ నేరుగా నమ్రతని రిక్వెస్ట్ చేసాడట. మహేష్ కి కూడా ఈ విషయం చెప్పలేదట, ఆ తర్వాత చిన్నగా నమ్రతనే ఈ విషయం చెప్పిందట.అందుకు మహేష్ ఆమెపై ఫైర్ అయ్యినట్టు సోషల్ మీడియా లో ఒక రూమర్ వినిపిస్తుంది.
Mahesh Babu- Namrata
ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మాత్రం వీళ్ళ మధ్య చిన్నపాటి వాగ్వివాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ కి నమ్రత నటించడం ఇష్టం లేదు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా లో తరుచు యాక్టీవ్ గా ఉండే నమ్రత ఈ విషయం పై స్పందిస్తుందో లేదో చూడాలి.