Rajamouli unhappy with Mahesh Babu: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు సాగుతుంది. రాజమౌళి సాహసం చేసి బాహుబలి సినిమా చేయడంతో పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు… దానికోసం మహేష్ బాబు సైతం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.
తను అనుకున్నట్టుగానే మహేష్ బాబు సైతం షూటింగ్లో పాల్గొంటున్నారట. షూటింగ్ సైతం అనుకున్న టైం కి కంప్లీట్ చేసి 2027 ఏప్రిల్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్న సమయానికి ఈ సినిమా పూర్తవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి ఈ సినిమాని అనుకున్న టైమ్ కి కంప్లీట్ చేయాలని చూసినా కూడా మహేష్ బాబు మాత్రం ఈ సినిమా షూటింగ్ కి కొంతవరకు బ్రేక్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది.
మధ్య మధ్యలో తను టూర్స్ కి వెళ్ళడం ఇతర కారణాల వల్ల మహేష్ బాబు షెడ్యూల్స్ ని కొంతవరకు పోస్ట్ పోన్ చేసేలా చేస్తున్నాడట. దీంతో రాజమౌళి ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అనుకున్న టైమ్ కి పూర్తయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని రాజమౌళి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాడు. కానీ మహేష్ బాబు మాత్రం అలా చేయడం లేదు… ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి సైతం మహేష్ బాబుకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది.
తనను ఎటు బయటకు వదలకుండా సినిమా కంప్లీట్ అయ్యేంతవరకు తనతోనే ఉంచుకోవాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారట. మరి మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం సీరియస్ గా కష్టపడుతున్నప్పటికి షెడ్యూల్స్ విషయంలో కొంతవరకు అక్కడక్కడ తేడాలైతే వస్తున్నాయి…ఇక దీని మీద జక్కన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. మహేష్ బాబు టూర్స్ కి వెళ్లడం మానేస్తాడా? సినిమా షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు సినిమా మీద సీరియస్ గా వర్క్ చేస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…