Star Heroes Families: ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా చిగురిస్తుందో ఎవ్వరు చెప్పలేరు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు నడపడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కొంతమంది వీటన్నింటికి దూరంగా ఉంటుంటే ఇంకొంతమంది హీరోలు మాత్రం హీరోయిన్స్ తో సన్నిహిత్యంగా ఉంటూ వాళ్లకు అవకాశాలను కల్పిస్తూ వాళ్లను టాప్ హీరోయిన్ గా మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇక హీరోలకు పెళ్లి కాకముందు ఇలాంటివి చేస్తే పర్లేదు. కానీ పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి వ్యవహారాల్లో తల దూరిస్తే చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ లాంటి నటుడు సైతం ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తన భార్య అయిన సంగీత తన భర్త విజయ్ తనతో పాటు కలిసి ఉండటం లేదని అందువల్లే విజయ్ కి విడాకులు ఇవ్వడానికి కోర్టు నుంచి నోటీసులైతే పంపించింది. మొత్తానికి అయితే ఒక స్టార్ హీరోయిన్ వల్లే వీళ్ళిద్దరూ విడిపోతున్నారు అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.
ఇక ఇంతకు ముందు ఆ హీరోయిన్ ప్రభాస్ ను చేసుకుంటానని అనడం ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని చూశారంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి.ఇక ఎట్టకేలకు ప్రభాస్ ఇప్పటి వరకు ఎవ్వరిని పెళ్లి చేసుకోలేదు ప్రస్తుతం 45 సంవత్సరాల వయసులో ఉన్న ప్రభాస్ ఇప్పటికీ కూడా ఇంకెవరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండడం అనేది ప్రతి ఒక్కరిని ని ఆశ్చర్యపరుస్తుంది…
ఇక ఆ హీరోయిన్ ని పీకల్లోతు గా ప్రేమించిన ప్రభాస్ ఆమెతో బ్రేకప్ అవ్వడంతో తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయినట్టుగా కొంతమంది చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఆ హీరోయిన్ వల్లే తమిళ్ స్టార్ హీరో విజయ్ ఫ్యామిలీ వ్యవహారాల్లో కొన్ని వివాదాలు వచ్చాయి. దాంతో విజయ్ తన భార్య నుంచి తను విడిపోవడానికి కారణం అవుతుంది.
ఇక ఈ విషయం మీద సినిమా మేధావులు ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటే మాత్రం తీవ్రమైన విమర్శలను మూట గట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం విజయ్ పేరు తమిళనాడు అంతట భారీగా వినిపిస్తుంది కొంతమంది అతను చేసింది చాలా వరకు రాంగ్ అంటూ అతని మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు…