spot_img
Homeఎంటర్టైన్మెంట్Veera Simha Reddy: యూఎస్ థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ అతి.... బయటకు గెంటేసిన యాజమాన్యం! 

Veera Simha Reddy: యూఎస్ థియేటర్లో బాలయ్య ఫ్యాన్స్ అతి…. బయటకు గెంటేసిన యాజమాన్యం! 

Veera Simha Reddy: పుట్టుకతో వచ్చిన బుద్ది పుల్లలతో కానీ పోదంటారు. ఎంత అమెరికాలో ఉంటున్నా తెలుగోళ్ళ అలవాట్లు ఎందుకు మారతాయి. డీసెన్సీకి మారుపేరైన అమెరికన్ సొసైటీలో ఉంటూ కల్చర్ లెస్ బిహేవియర్ తో ఆంధ్రావాళ్లు వార్తలకెక్కుతున్నారు. ఫ్యాన్ వార్ పేరుతో ఇటీవల పవన్ కళ్యాణ్-బాలకృష్ణ ఫ్యాన్స్ చికాగోలో కొట్టుకున్నారు. అది పెద్ద న్యూస్ అయ్యింది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు మరో న్యూసెన్స్ చేశారు. వీరసింహారెడ్డి థియేటర్లో అభిమానుల అల్లరి హద్దులు దాటిపోగా యాజమాన్యం బయటకు పంపేసింది.

Veera Simha Reddy
Veera Simha Reddy

జనవరి 12న వీరసింహారెడ్డి వరల్డ్ వైడ్ పెద్ద ఎత్తున విడుదల చేశారు. యూఎస్ లో ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైంది. కాగా ఓ థియేటర్లో పేపర్స్ విసురుతూ బాలయ్య ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. కాసేపు ఉపేక్షించిన యాజమాన్యం మరింతగా రెచ్చిపోతుంటే… మూవీ ప్రదర్శన ఆపేశారు. అందరూ థియేటర్ నుండి వెళ్లిపోవాలని ఆదేశించారు. గతంలో చాలా తెలుగు సినిమాలు, ఇండియన్ సినిమాలు ఈ థియేటర్లో ప్రదర్శించారు. ఇంత అల్లరి ఎవరూ చేయలేదు. మూవీ ప్రదర్శించేది లేదు. వెంటనే బయటకు వెళ్లిపోండని గట్టిగా చెప్పారు.

చేసేది లేక బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మిగతా ఆడియన్స్ థియేటర్ ని వీడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అభిమానం పేరుతో చేసే ఇలాంటి చర్యలు ఆంధ్రాలో మాత్రమే చెల్లుతాయి. అమెరికాలో కాదంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్టార్ హీరోల అభిమానులు థియేటర్స్ ధ్వంసం చేశారు. లక్షల్లో యాజమాన్యాలకు నష్టం చేకూర్చారు.

Veera Simha Reddy
Veera Simha Reddy

హీరో మీద అభిమానులు చూపించే ప్రేమ ఆయన గౌరవం పెంచేదిగా ఉండాలి. ఇలా దిగజార్చేదిగా ఉండకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక వీరసింహారెడ్డి మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. యాక్షన్, బాలకృష్ణ డైలాగ్స్ మినహాయించి సినిమాలో చెప్పుకోదగ్గ విషయం లేదని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అవుట్ డేటెడ్ కథ, కథనాలు సినిమా ఫలితం దెబ్బతీశాయి అంటున్నారు. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అంశాలున్న నేపథ్యంలో వీరసింహారెడ్డి విజయం సాధిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Oktelugu Epaper