Elon Mask Cyber ​​Truck : ఎలన్ మాస్క్ సైబర్ ట్రక్.. తూటాలు పేల్చిన బాంబులు వేసిన ఏం కాదంతే.. వైరల్ వీడియో

Elon Mask Cyber ​​Truck : మస్క్ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. పేరు తెలియని ఓ ప్రాంతంలో టెస్లా తయారుచేసిన ఓ సైబర్ ట్రక్ పార్క్ చేసి ఉంది. దాన్ని ఒక వ్యక్తి రాయితో కొట్టాడు.. బలమైన ఇనుప చువ్వతో బాదాడు.

Written By: NARESH, Updated On : July 2, 2024 11:51 am

Elon Mask Cyber ​​Truck Video Goes Viral

Follow us on

Elon Mask Cyber ​​Truck : ఒక ఉత్పత్తిని తయారు చేయడం వెనక ఎంత శ్రమ ఉంటుందో.. అమ్మాలంటే కూడా అంతే శ్రమ ఉంటుంది.. అందుకే ప్రపంచంలో గొప్ప గొప్ప ఉత్పత్తిదారులు విక్రేతలు కాలేకపోయారు. అయితే ఈ జాబితాలో కొంతమంది మాత్రం పూర్తి విభిన్నం. ఎందుకంటే వారే తమ ఉత్పత్తులు తయారుచేసి.. వారే దర్జాగా విక్రయించుకుంటున్నారు. అందులో ఎలాన్ మస్క్ అగ్రగణ్యుడు. శూన్యంలోనూ అవకాశాలను సృష్టిస్తాడు. ఎడారిలోనూ నీళ్లను పుట్టిస్తాడు. అవకాశాల కోసం ఎంతదాకైనా వెళ్తాడు. తనకు నచ్చితే ఎంత దూరమైనా ప్రయాణిస్తాడు. వద్దనుకుంటే నిర్మొహమాటంగా దూరం పెట్టేస్తాడు.. ట్విట్టర్ కొనుగోలు చేసి.. దానికి ఎక్స్ అని పేరుపెట్టినా.. ముగ్గురు భార్యలను చేసుకొని.. 11 మంది పిల్లలను కన్నా.. ఎన్నికల నిర్వహణలో ఈవీఎం లు చాలా డేంజర్ అని చెప్పినా.. అతడికి అతడే సాటి. ముందే చెప్పుకున్నట్టు తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడంలో ఎలాన్ మస్క్ ను మించిన వారు లేరు. మస్క్ ఎలాంటి వాడంటే.. తన టెస్లా ఉత్పత్తులను ప్రచారం చేసేందుకు గొప్ప గొప్ప స్టార్ లను నియమించుకోడు. జస్ట్ జస్ట్ సామాన్యులతోనే ప్రచారం కొనసాగిస్తాడు. అలా తన రూపొందించిన సైబర్ ట్రక్ విషయంలోనూ అదే విధానాన్ని అనుసరించాడు. సైబర్ ట్రక్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా రూపొందించారు? అది ఎందుకు అంత నాణ్యంగా ఉంటుంది? మిగతా ఉత్పత్తులతో పోలిస్తే సైబర్ ట్రక్ ఎందుకు భిన్నమైనది? అనే అంశాలను కస్టమర్లకు వివరిస్తూ.. తన ట్విట్టర్ ఎక్స్ లో ఒక వీడియోను మస్క్ పోస్ట్ చేశాడు.

మస్క్ పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. పేరు తెలియని ఓ ప్రాంతంలో టెస్లా తయారుచేసిన ఓ సైబర్ ట్రక్ పార్క్ చేసి ఉంది. దాన్ని ఒక వ్యక్తి రాయితో కొట్టాడు.. బలమైన ఇనుప చువ్వతో బాదాడు. ఒక రంపాన్ని తీసుకొచ్చి కోయ బోయాడు. అయినప్పటికీ ఆ వాహనం చెక్కుచెదరలేదు. పైగా దానికి కొంచెం కూడా డ్యామేజ్ జరగలేదు.. ఆ కారు అంతటి విధ్వంసానికి పాల్పడినప్పటికీ దృఢంగా కనిపిస్తోంది. నలపైన అద్దాలు, బూడిద రంగులో ఫ్రేమ్ లు, బలమైన టైర్లతో టెస్లా సైబర్ ట్రక్ చూసేందుకు ఒక బీస్ట్ అవతారంలో కనిపిస్తోంది.

గ్లోబల్ మార్కెట్లో సైబర్ ట్రక్ లాంచ్ చేయాలని మస్క్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. సరిగ్గా ఈమధ్య లాంచ్ చేశాడు. ప్రపంచ మార్కెట్లలో సైబర్ ట్రక్ అందుబాటులో ఉంది. భారత్ లో మాత్రం ఇంతవరకు అడుగు పెట్టలేదు. అయితే దీనిపై సమాధానాలు లభించాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. సైబర్ ట్రక్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్, ట్రై మోటర్ విభాగాలలో అందుబాటులో ఉంది. ఆటోమొబైల్ పరిభాషలో టాప్ స్పెక్ మోడల్ ను సైబర్ బీస్ట్ అని పిలుస్తారు. ఇందులో సింగిల్ మోటార్ వేరియంట్ మోడల్ 402 కిలోమీటర్ రేంజ్ అందిస్తుంది. సైబర్ బీస్ట్ 845 హార్స్ పవర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. దీని ధర భారతీయ కరెన్సీలో 83.34 లక్షలు. ఈ కారు ఏకంగా 515 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. అయితే సైబర్ ట్రక్ మోడల్స్ మాత్రం ప్రస్తుతం అమెరికా మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వచ్చే రోజుల్లో మరిన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.