spot_img
Homeబిజినెస్Renault Duster booking closed: Duster బుకింగ్ క్లోజ్.. ఈ కారు కావాలంటే దీపావళి వరకు...

Renault Duster booking closed: Duster బుకింగ్ క్లోజ్.. ఈ కారు కావాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.. ఈ కారుకు ఎందుకంత డిమాండ్?

Renault Duster booking closed: దశాబ్దం కాలం కిందట రెనాల్ట్ కంపెనీకి చెందిన డస్టర్ SUV వేరియంట్ లో సంచలనం సృష్టించింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత కొత్త తరహాలో డస్టర్ SUV ని తిరిగి తీసుకువచ్చారు. వచ్చి రాగానే ఈ కారు మరో ట్రెండు క్రియేట్ చేసింది. ఈ కారు విడుదలకు ముందే కొన్ని బుకింగ్ కాగా.. విడుదల అయిన తర్వాత అద్భుతమైన స్పందన లభించినట్లు తెలుస్తోంది. 2026 సంవత్సరానికి ఈ కారు బుకింగ్ క్లోజ్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఈ హైబ్రిడ్ కారుకు వచ్చిన స్పందన అంచనాలకు మించిపోయిందని.. దీంతో తిరిగి అక్టోబర్ లోని బుకింగ్ ప్రారంభమవుతాయని అంటున్నారు.. దీని వివరాల్లోకి వెళితే..

పట్టణ, నగర మార్కెట్లలో Renault Duster కొత్త కారుకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ఏడాదికి సంబంధించిన బుకింగ్స్ క్లోజ్ అయినట్టు రెనాల్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఫ్రాన్సిస్కో హిడాల్గో మాట్లాడుతూ.. హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ కు అద్భుతమైన స్పందన లభించిందని అన్నారు. హైబ్రిడ్ ఫ్రీ బుకింగ్ లో 36% మెట్రో నగరాల నుంచే ఉందని అన్నారు. SUV సెగ్మెంట్లో కొనుగోలుదారులు కొత్త కారు కోసం ఎదురు చూశారని.. ఇదే సమయంలో డస్టర్ వారి కోరిక తీర్చమని చెప్పారు. పట్టణాలతో పాటు నగర మార్కెట్లో హైబ్రిడ్ వాహనాల పట్ల ఆదరణ పెరుగుతోందని అన్నారు. అయితే దీపావళి సందర్భంగా అక్టోబర్లో తిరిగి బుకింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.

Renault కొత్త డస్టర్ ను రూ.10.49 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ను అమర్చారు. ఇందులో ఒకటి 1.0 లీటర్ సిలిండర్ టర్బో చార్జర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. మరొకటి 1.3 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ తో పనిచేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. మరొక వెర్షన్ లో హైబ్రిడ్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇందులో 1.8 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. ఇది 49 bhp పవర్ అందిస్తుంది. అలాగే దీనితోపాటు ఎలక్ట్రిక్ మోటార్ 1.4 KWh బ్యాటరీ ప్యాక్ ను చేర్చారు. ఇది 20 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది.

అయితే రెనాల్ట్ కంపెనీ త్వరలో CNG వెర్షన్ కూడా తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పెట్రోల్ కార్ల కంటే హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే డస్టర్ కు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చెన్నైలో తయారవుతున్న డస్టర్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ ప్రతినిధులు కృషి చేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper
Exit mobile version