spot_img
Homeబిజినెస్Maruti Wagon R mileage and price: చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు ఇదే.. మైలేజ్...

Maruti Wagon R mileage and price: చిన్న ఫ్యామిలీకి బెస్ట్ కారు ఇదే.. మైలేజ్ తెలిస్తే వెంటనే కొంటారు…

Maruti Wagon R mileage and price: దేశంలో నెంబర్ వన్ కార్ల విక్రయాల కంపెనీగా పేరు ఉన్న Maruti Suzuki నుంచి ఎన్నో ఆకట్టుకునే మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వీటిలో కొన్ని దశాబ్దాల కిందట నుంచి ఇప్పటివరకు అవే మోడల్స్ కొత్తదనంతో వస్తూ ఉంటున్నాయి. వీటిలో WagonR గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చిన్న ఫ్యామిలీకి అనుగుణంగా మార్కెట్లోకి వచ్చిన ఈ కారు 2026 సంవత్సరంలో లేటెస్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. అయితే భారతదేశంలో ఈ కారు ఇప్పుడు ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కారు గా చెప్పబడుతుంది. హాచ్ బ్యాక్ వేరియంట్ లో ఇదే బెస్ట్ కారు అని అంటున్నారు. అందుకు కారణం ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు మైలేజ్ అని అంటున్నారు. వాటి వివరాల్లోకి వెళితే..

కొత్తగా కారు కొనాలని అనుకునే వారితోపాటు.. మిడిల్ క్లాస్ పీపుల్స్ సొంతంగా కారు ఉండాలని అనుకునేవారు ముందుగా వ్యాగన్ఆర్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారును 2026 సందర్భంగా లేటెస్ట్ టెక్నాలజీ తో పాటు ఇంజన్లో మార్పులు చేసి తీసుకొచ్చారు. కొత్తగా వచ్చిన ఈ కారు గతంలో కంటే డిజైన్ విషయంలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనికి LED హెడ్ లాంప్స్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి. కొత్త గ్రిల్ తో పాటు అప్డేట్ చేయబడిన బంపర్ లను సెట్ చేశారు. అలాగే టాల్ బాయ్ డిజైన్ కూడా ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఇన్నర్ డిజైన్ కూడా స్మూత్ గా ఉంటుంది. అలాగే స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో తో పాటు ఆపిల్ కార్ ప్లే, బిగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి మెరుగైన సౌకర్యాలను అందిస్తుంది. ప్రయాణికులు సౌకర్యవంతంగా లాంగ్ డ్రైవ్ చేయడానికి 341 లీటర్ల బూట్ స్పేస్ ను కలిగే ఉంది. సేఫ్టీ కోసం ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ కెమెరాతోపాటు మరిన్ని భద్రతా ఫీచర్లు చూడొచ్చు.

ఈ కారు ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో 1.0 లీటర్, 1.2 లీటర్ కె సిరీస్ కలిగిన పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. అలాగే CNG వేరియంట్ కూడా చూడొచ్చు. సిఎన్జి కిలో ఇంధనానికి 33 నుంచి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. దీంతో రోజువారి వినియోగదారులతోపాటు లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఈ మైలేజ్ సపోర్ట్ గా ఉండనుంది. అంతేకాకుండా ఈ కారు ధర రూ. 5.64 లక్షల ప్రారంభం నుంచి రూ. 8.46 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అలాగే వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...
Oktelugu Epaper
Exit mobile version