Site icon OkTelugu

Best Mileage Bikes In India 2026: ఉద్యోగులకు ఎలాంటి కష్టం లేకుండా రైడింగ్.. లీటర్ పెట్రోల్ పోస్తే 90 కిలోమీటర్ల వరకు మైలేజ్.. వీటి గురించి తెలుసుకోవాల్సిందే..

Best Mileage Bikes In India 2026

Best Mileage Bikes In India 2026

Best Mileage Bikes In India 2026: ప్రస్తుత కాలంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంధనం పొదుపు చేయడం చాలా అవసరం. ఇలాంటి అప్పుడు ఎక్కువగా మైలేజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, రోజువారి వినియోగదారులకు తక్కువ ధరలో బైక్స్ అందుబాటులోకి వచ్చి ఎక్కువగా మైలేజ్ ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.. ఇలాంటి బైక్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటి గురించి చాలామందికి పూర్తిగా తెలియకుండా ఉంది. ఇవి చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాయి. కానీ మైలేజ్ విషయంలో మాత్రం వీటికి మించి సాటిలైవు అన్నట్టుగా ఉన్నాయి. ఇంతకీ ఆ బైక్స్ ఏవో తెలుసుకోవాలని ఉందా..?

ఒకప్పుడు ఒక వ్యక్తికి హీరో స్ప్లెండర్ బండి ఉందంటే అతడిని గొప్పగా చూసేవారు. తరతరాలుగా ఎంతో మందిని ఆదరించిన స్ప్లెండర్ బండి ఇప్పుడు కూడా హీరో కంపెనీ నుంచి అందుబాటులో ఉంది. Splendor Plus పేరుతో మార్కెట్లో కొనేందుకు సిద్ధంగా ఉన్న ఈ బైక్ ధర రూ.74,152 ఎక్స్ షోరూం నుంచి.. రూ.76,437 మధ్య అందుబాటులో ఉంది. ఇందులో 97.2 సిసి ఇంజన్ ఉండగా.. ఇది లీటర్ ఇందడానికి 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులతో పాటు ఇంధనం పొదుపు చేయాలని అనుకునే వారికి ఇది బాగా సరిపోతుందని డిపుణులు అంటున్నారు.

బజాజ్ కంపెనీకి చెందిన బైక్స్ మైలేజ్ విషయంలో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కంపెనీ నుంచి ప్లాటినా 100 బైక్ బెస్ట్ మైలేజ్ గా నిలుస్తోంది. దీనిని రూ.66,015 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. 102 సిసి ఇంజన్ ఉన్న ఈ బైక్ లీటర్ ఇంధనానికి 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే TVS కంపెనీకి చెందిన రేడియన్ బైక్ కూడా మైలేజ్ కోరుకునే వారికి ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. ఇందులో 109.7 సిసి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ లీటర్ ఇంధనానికి 60 నుంచి 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీనిని రూ.68,100 నుంచి రూ.80,300 వరకు విక్రయిస్తున్నారు. ఎలక్ట్రిక్ సెల్ఫ్ స్టార్ట్ సౌకర్యం ఉండే ఇది యూత్ కు కూడా బాగా నచ్చుతుంది.

బెస్ట్ బైక్స్ నో అందించడంలో ప్రముఖంగా నిలుస్తున్న హీరో కంపెనీ నుంచి Shine 100 కూడా మైలేజ్ విషయంలో సపోర్ట్ గా ఉంటుంది. ఇందులో 98.98 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉండగా.. లీటర్ ఇంధనానికి 65 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీనిని రూ.65,243 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీని డిజైన్ కూడా స్టైలిష్ గా ఉండడంతో యూత్ బాగా కోరుకుంటు ఉన్నారు.

Exit mobile version