Prabhas: ప్రభాస్ ను బీట్ చేసే అవకాశం ఉన్న తెలుగు హీరోలు వీళ్లే…

Prabhas: ప్రస్తుతం ఏ ఇండియన్ హీరో కూడా లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

Written By: Gopi, Updated On : July 2, 2024 11:54 am

These are the Telugu heroes who can beat Prabhas

Follow us on

Prabhas: తెలుగులో మొదలైన ప్రభాస్ ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుందనే చెప్పాలి. కల్కి సినిమాతో వందల కోట్ల వసూళ్లను రాబట్టడమే కాకుండా తెలుగు సినిమా స్టాండర్డ్ ని ప్రపంచవ్యాప్తంగా మరోసారి తెలిసేలా చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే వరుసగా ఐదు సినిమాలతో 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిన ఏకైక హీరోగా కూడా ప్రభాస్ మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు.

ఈయన దరిదాపుల్లో ప్రస్తుతం ఏ ఇండియన్ హీరో కూడా లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఇక కల్కి సినిమా మాత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. అయితే ఒకవేళ మంచి సినిమాలు పడితే ప్రభాస్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్న తెలుగు హీరోలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే రామ్ చరణ్, మహేష్ బాబు… వీళ్లకు మాత్రమే రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాజమౌళి స్టాండర్డ్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఇక ఆయన క్రియేట్ చేసిన రికార్డును ఆయనే బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. కాబట్టి మహేష్ బాబు ప్రభాస్ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక రామ్ చరణ్ కూడా రాబోయే రెండు మూడు సినిమాలతో ప్రభాస్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే లాంగ్ రన్ లో వీళ్లు వరుస సినిమాలతో సక్సెస్ ను అందుకుంటారా ప్రభాస్ ఇప్పుడు వరుసగా ఐదు సినిమాలతో 300 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. మరి అలాంటి రికార్డులను వీళ్ళు క్రియేట్ చేయగలరా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…