
Rashmi Gautam: యాంకరింగ్ కి డెఫినిషన్ మార్చేసిన అమ్మాయిల్లో రష్మీ గౌతమ్ ఒకరు. అనసూయ, రష్మీ జబర్దస్త్ వేదికా కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు. బుల్లితెరపై స్కిన్ షో చేయడం స్టార్ట్ చేశారు. వీరిద్దరి సక్సెస్ కి కారణం కూడా ఇదే. రష్మీకి స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉంది. ఆమె గ్లామర్ అంటే పడిచచ్చే బుల్లితెర ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అందుకే రష్మీ యాంకర్ గా ఉన్న షోల టీఆర్పీలు పరుగులు పెడుతున్నాయి.
వైజాగ్ కి చెందిన రష్మీ హీరోయిన్ కావాలని పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఆమెకు సైడ్ క్యారెక్టర్స్, వ్యాంప్ రోల్స్ మాత్రమే దక్కాయి. ఏళ్ల తరబడి ఎదురు చూసినా బ్రేక్ రాలేదు. దీంతో బుల్లితెర బాట పట్టింది. జబర్దస్త్ యాంకర్ గా మారాలన్న ఆమె ఆలోచన జీవితాన్ని మార్చేసింది. అప్పటి జబర్దస్త్ యాంకర్ అనసూయ వ్యక్తిగత కారణాలతో షో నుండి తప్పుకున్నారు. ఆమె స్థానంలోకి రష్మీ వచ్చారు.

ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయ్యాక అనసూయకు మరలా ఛాన్స్ దక్కింది. ఇక హీరోయిన్ కావాలన్న రష్మీ కోరిక యాంకర్ అయ్యాక తీరింది. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కావడంతో రష్మీకి జనాల్లో విపరీతమైన పాపులారిటీ పెరిగింది. దీంతో ఆమెకు మేకర్స్ సినిమా ఆఫర్స్ ఇచ్చారు. అయితే సినిమా అవకాశాలను రష్మీ సద్వినియోగం చేసుకోలేకపోయింది. వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ పోయింది.

వరుస పరాజయాలతో నటిగా రష్మీ జోరు తగ్గింది. గతంలో మాదిరి ఆమెకు అవకాశాలు రావడం లేదు. హీరోయిన్ గా రష్మీ చివరి చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. నందు హీరోగా నటించిన ఈ మూవీ గత ఏడాది విడుదలైంది. రష్మీకి ఈ చిత్రం కూడా నిరాశే మిగిల్చింది. ఈ విషయంలో అనసూయ కెరీర్ చక్కగా ప్లాన్ చేసుకుంది.
ఇక సోషల్ మీడియాలో రష్మీ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఆమె హాట్ అండ్ బోల్డ్ ఫోటో షూట్స్ తో నెటిజెన్స్ ని ఫిదా చేస్తున్నారు. తాజాగా షార్ట్ ఫ్రాక్ లో సూపర్ హాట్ ఫోజులతో చంపేసింది. రష్మీ గ్లామరస్ ఫోటోలు చూసిన జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.