Homeట్రెండింగ్ న్యూస్Shocking Wedding Incident: మరి కొద్ది సేపట్లో పెళ్లి.. మండపం లో పెళ్లికూతురు చేసిన పనికి...

Shocking Wedding Incident: మరి కొద్ది సేపట్లో పెళ్లి.. మండపం లో పెళ్లికూతురు చేసిన పనికి అంతా షాక్!

Shocking Wedding Incident: మరి కాసేపట్లో పెళ్లి. ఆ కళ్యాణమండపం మొత్తం హడావిడిగా ఉంది. పెళ్లి కుమారుడు పీటల మీద కూర్చున్నాడు. పెళ్లికూతురు రాణి వచ్చింది. పెళ్లి మండపం మీదికి ఆమెను తీసుకొచ్చారు. పండితుడు మంత్రాలు మొదలుపెట్టాడు. మరి కాసేపట్లో పెళ్లి జరుగుతుంది అనుకునే క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!

సరిగ్గా ముహూర్త సమయానికి అర్చకుడు వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టించాడు. అనంతరం మాంగల్య ధారణ జరుగుతుందనగా అనుకోని పరిణామం చోటుచేసుకుంది. దీంతో పెళ్లి మండపంలో షాకింగ్ సంఘటన జరిగింది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు ఇంటి వద్ద కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సంప్రదాయం ప్రకారం వధూవరుల తలల మీద జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం పూర్తి చేశారు. తాళి కట్టే సమయం నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ పరిణామాలు మారిపోయాయి. చూస్తుండగానే ఒక యువకుడు అక్కడికి వచ్చేసాడు. అతడు రాగానే వధువు ఆందోళన చెందింది. ఆమె ముఖంలో భయం కనిపించింది. వచ్చావా అంటూనే.. పెళ్లి కుమార్తె పీటల మీద నుంచి లేచిపోయింది. ఆ యువకుడి పక్కన నిలబడింది. దీంతో పెళ్లి కుమారుడు.. మిగతా వారంతా షాక్ కు గురయ్యారు.

” ఈ అబ్బాయిని నేను ప్రేమించాను. అతడు కూడా నన్ను ప్రేమించాడు. మా తల్లిదండ్రులు బలవంతంగా ఈ పెళ్లిని చేస్తున్నారు. ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు” అని పెళ్లికూతురు చెప్పింది. దీంతో పెళ్లి కుమార్తె తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు . ఆ యువకుడి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు. గొడవను సద్దు మణిగించారు.

ఇక పెళ్ళికుమారుడు జరిగిన సంఘటనతో తీవ్రంగా కలత చెందాడు. లక్షలు పెట్టి ఈ స్థాయిలో వివాహం జరిపించాలని ఏర్పాట్లు చేశాం. బంధువులను పిలిపించి భోజనాలు కూడా పెట్టించాం. మాకు ఉన్నది ఒకడే కుమారుడు. ఈ సంఘటనతో మా పరువు మొత్తం పోయిందని వారు విలపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పెద్దమనుషులు పంచాయతీ నిర్వహించి వధువు తరఫున వారి నుంచి.. వరుడు తరుపు వారికి డబ్బులు చెల్లించే విధంగా తీర్మానం చేసినట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular