Homeఎంటర్టైన్మెంట్Lenin Movie : థియేటర్స్ లోకి వచ్చి వారం కూడా అవ్వలేదు.. అప్పుడే ఓటీటీ లోకి...

Lenin Movie : థియేటర్స్ లోకి వచ్చి వారం కూడా అవ్వలేదు.. అప్పుడే ఓటీటీ లోకి ‘లెనిన్’

అక్కినేని అఖిల్ లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చి , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకొని వెళ్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 44 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 25 కోట్ల రూపాయలకు […]

అక్కినేని అఖిల్ లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చి , మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకొని వెళ్తోంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 44 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. వీకెండ్ తర్వాత మొదటి సోమవారం డిస్టింక్షన్ లో పాస్ అయిన ఈ చిత్రం , నేడు కూడా అనేక థియేటర్స్ లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది. చూస్తుంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు , లాంగ్ రన్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది.

ఇకపోతే విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని జీ 5 సంస్థ మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఒకవేళ ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే , ముందు ఒప్పుకున్నా రేట్ కంటే 3 కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని ఓటీటీ సంస్థ మేకర్స్ తో ఒప్పందం చేసుకుంది. కానీ థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. అందుకు మేకర్స్ కూడా ఒప్పుకోవడం తో , ఈ చిత్రం ఆగష్టు 8 న జీ5 యాప్ లో తెలుగు తో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ సినిమాకు మూడు , నాలుగు వారాలు గడిచిన తర్వాత కూడా సాలిడ్ థియేట్రికల్ రన్ ఉంటే మాత్రం , ఓటీటీ విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి.

మరోపక్క మేకర్స్ ఈ సినిమాని విడుదలకు ముందు ఏ రేంజ్ లో ప్రమోట్ చేశారో , విడుదల తర్వాత కూడా అదే రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ ఇంటర్వ్యూస్ తో పాటు , టీవీ లో ప్రసారమయ్యే పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా పాల్గొంటూ , ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుంది. అయితే మేకర్స్ వేయిస్తున్న కలెక్షన్స్ పోస్టర్స్ పైన మాత్రం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. మూడు రోజుల్లో కనీసం 40 కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టని ఈ చిత్రానికి , ఏకంగా 61 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ గ్రాస్ వసూళ్లు మొదటి వారం లో వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. కచ్చితంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతంగా ఆడుతోంది , అందులో ఎలాంటి సందేహం లేదు , కానీ నిర్మాతల అత్యుత్సాహం కారణంగా ట్రోలింగ్స్ కి గురి అవుతోంది ఈ చిత్రం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper