Homeబిజినెస్2026 Two Wheeler Sales Data India: 2026 టు వీలర్ సేల్స్ డేటా రిలీజ్.....

2026 Two Wheeler Sales Data India: 2026 టు వీలర్ సేల్స్ డేటా రిలీజ్.. ఏ కంపెనీ ఎన్ని వాహనాలు విక్రయించింది అంటే?

2026 Two Wheeler Sales Data India: 2026 Two Wheeler Sales Data India: రోజువారి అవసరాలతో పాటు ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లేవారికి ద్విచక్ర వాహనం తప్పనిసరిగా మారింది. కాలం మారుతున్న కొద్ది అప్డేట్ అయినా వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు తమకు కన్వీనెంట్ గా ఉండేందుకు వినియోగదారులు కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీల సేల్స్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి 2026 […]

2026 Two Wheeler Sales Data India: 2026 Two Wheeler Sales Data India: రోజువారి అవసరాలతో పాటు ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లేవారికి ద్విచక్ర వాహనం తప్పనిసరిగా మారింది. కాలం మారుతున్న కొద్ది అప్డేట్ అయినా వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు తమకు కన్వీనెంట్ గా ఉండేందుకు వినియోగదారులు కొత్త కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీల సేల్స్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్నాయి. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు మొత్తం ద్విచక్ర వాహనాలు 1,94,58,477 ఎకరాలు జరుపుకున్నాయి. ఇదే కాలంలో కథ ఏడాది 1,7373,374 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 2025-26 అమ్మకాల్లో 12% వృద్ధి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ 2026 ఫిబ్రవరి నెలలో ఎన్ని యూనిట్లు అమ్మకాలు జరిగినాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!

2026 ఫిబ్రవరి నెలలో మొత్తం 17,00,505 యూనిట్ల వాహనాలు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇది 2025 ఫిబ్రవరి తో పోలిస్తే 25.02 శాతం పెరుగుదల ఏర్పడినట్టు తెలుస్తుంది. కానీ 2026 జనవరి తో పోలిస్తే మాత్రం 8.2 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. అయితే వినియోగదారులు ఎక్కువగా పెట్రోల్, ఇథనాల్ వాహనాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రకమైన వాహనాలు 93.34 శాతాన్ని అధిగమించాయి. గత ఏడాదిలో 94.06 శాతం గా ఉంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు 6.57 శాతం ఉండగా..CNG వాహనాలు 0.09% వాటాలతో ఉన్నాయి. వినియోగదారుల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన పెరుగుతుండడంతో వాటినే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ద్విచక్ర వాహనాల కంపెనీల్లో అత్యధికంగా Hero కంపెనీకి చెందిన మోటో కార్ప్ ఎక్కువగా విక్రయాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన వాహనాలు 2026 ఫిబ్రవరిలో 4,57,826 యూనిట్లు ఉన్నాయి. ఆ తర్వాత Honda కంపెనీ 4,31,253 వాహనాలను విక్రయించింది. టీవీఎస్ మోటార్ 3,33,935 ద్విచక్ర వాహనాలను అమ్మకాలు చేసింది. బజాజ్ కంపెనీ 1,80,846 యూనిట్ల విక్రయాలు జరిపి నాలుగో స్థానంలో నిలిచింది. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా 94,398 వాహనాలను విక్రయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ 91,216 యూనిట్ల అమ్మకాలు చేసింది. ఈ కంపెనీకి చెందిన 350 సిసి కంటే తక్కువ ఉన్న మోటార్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. యమహా కంపెనీ ఫిబ్రవరి నెలలో మొత్తం 60,967 ద్విచక్ర వాహనాలను సేల్స్ చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో Aither కంపెనీ 20,584 యూనిట్లను విక్రయాలు చేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత గ్రీవ్స్ ఎలక్ట్రిక్ కంపెనీ 4,724 వాహనాలను సేల్స్ చేసింది. ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తున్నాయి. దీని రిటైల్ వాహనాలు 3,968 కి పడిపోయాయి. మొత్తంగా 2026 ఫిబ్రవరి నెలలో పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

Most Popular

Oktelugu Epaper