Homeఎంటర్టైన్మెంట్Venkatesh : 'ఆదర్శ కుటుంబం' నుండి ఐటమ్ సాంగ్ లీక్..

Venkatesh : ‘ఆదర్శ కుటుంబం’ నుండి ఐటమ్ సాంగ్ లీక్..

Venkatesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా , నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన నెగెటివ్ షేడ్స్ […]

Venkatesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రాన్ని మొదలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా , నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన నెగెటివ్ షేడ్స్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో , ఈ చిత్రం పై మార్కెట్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఐటెం సాంగ్ షూటింగ్ వీడియో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఈ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ పాటలో వెంకటేష్ స్పష్టంగా కనిపిస్తున్నారు కానీ , ఆయనతో పాటు చిందులు వేస్తున్న హీరోయిన్ ఎవరు అనేది క్లారిటీ గా తెలియడం లేదు. ఇక తమన్ అందించిన మ్యూజిక్ కూడా క్యాచీగానే ఉంది. ఎప్పుడు ఈ పాట విడుదల అవుతుందో తెలియదు కానీ , విడుదలయ్యాక చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్పెషల్ ఐటెం సాంగ్ లో వెంకటేష్ తో కలిసి పూజా హెగ్డే చిందులు వేయబోతుంది అంటూ వార్తలు వచ్చాయి కానీ , దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు , మధ్యలో ఈ ఐటెం సాంగ్ ఏంటి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రం రీసెంట్ గా విడుదలైన అర్జున్ ‘బ్లాస్ట్’ మూవీ కి దగ్గరగా ఉంటుందని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరిగింది. ముందుగా ఆ సినిమా విడుదల కావడంతో , త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper