Payal Rajput: బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బాత్రూంలో ఫోటో షూట్ చేసింది. సెల్ఫీలు తీసుకొని ఇంస్టాగ్రామ్ లో వదిలింది. ప్రైవేట్ ఏరియాలో సెల్ఫీ దిగి పోస్ట్ చేయడం పెద్ద న్యూస్ అయ్యింది. సిల్వర్ స్క్రీన్ పై పాయల్ జోరు తగ్గగా హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతున్నారు. సీరియల్ నటిగా పాయల్ కెరీర్ మొదలైంది. తన ప్రతిభతో, గ్లామర్ తో హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఆర్ఎక్స్ 100 మూవీతో పాయల్ టాలీవుడ్ లో అడుగుపెట్టారు.

పాయల్-కార్తికేయ జంటగా నటించిన ఆర్ఎక్స్ 100 మూవీ సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మినిమమ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఎక్స్ 100 బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ న్యూ ఏజ్ లవ్ డ్రామా యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. పాయల్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన బోల్డ్ రోల్ చేసింది. కార్తికేయ భగ్న ప్రేమికుడిగా ట్రాజిక్ రోల్ చేశారు.
ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ పాయల్ కి మరలా పడలేదు. దీంతో ఆమె కెరీర్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. చెప్పుకోదగ్గ స్థాయిలో పాయల్ కి ఆఫర్స్ రాకపోవడం దురదృష్టం. పాయల్ నటించిన చిత్రాల్లో వెంకీ మామ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రంలో వెంకీకి జంటగా సెకండ్ హీరోయిన్ రోల్ చేశారామె.దీంతో హిట్ క్రెడిట్ ఆమెకు దక్కలేదు.

ప్రస్తుతం పాయల్ అడపాదడపా ఆఫర్స్ తో నెట్టుకొస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ మాయాపేటిక విడుదలకు సిద్ధం అవుతుంది. ఇది సెల్ ఫోన్ దుష్ప్రభావాలపై తెరకెక్కిన చిత్రం. అలాగే కన్నడ, తమిళ చిత్రాల్లో పాయల్ నటిస్తున్నారు. తెలుగులో ఆమె కెరీర్ చివరి దశకు చేరినట్లు ఉంది. స్టార్ హీరోయిన్ అయ్యే ఆశలు దాదాపు కనుమరుగయ్యాయి.

కాగా చాలా కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తితో పాయల్ డేటింగ్ చేస్తున్నారు. ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పాయల్ తన ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. మరోవైపు పాయల్ సోషల్ మీడియా పోస్ట్స్ సంచలనం అవుతున్నాయి. తాజాగా టవల్ చుట్టుకుని బాత్రూం లో సెల్ఫీలు దిగింది. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రైవేట్ ఫోటోలు జనాలతో పంచుకున్న పాయల్ తీరు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.