Best Seafood List: మన చేపల కూరకు ప్రపంచ స్థాయి గుర్తింపు.. టాప్‌ 50లో స్థానం!

భారత దేశంలోని తీర ప్రాంతాలు సీ ఫుడ్‌కు పెంచుగాంచాయి. మన దేశంలో సము్ర‘దపు ఆహారానికి సబంధించి ఐకానిక్‌ కూరలు ఉన్నాయి.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 4:53 pm

Best Seafood List

Follow us on

Best Seafood List: మన దేశంలో చేపల కూర అంటే ఇష్టపడనివారు ఉండరు. చేపల పులుసు అంటేనే నోరూరించే వంటకం. పేరు చెప్పగానే ఎదుటివారి నోట్లో నీళ్లు ఊరుతాయి. వంట తయారు చేస్తున్నప్పుడే ఘుమఘుమలు అదిరిపోతాయి. అలాంటి మన చేపల కూరకు ఇప్పుడు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కింది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ తాజాగా ప్రకటించిన 50 ఉత్తమ సీఫుడ్‌ జాబితాలో భారతీయ చేపట వంటకానికి స్థానం కల్పించింది.

సీఫుడ్‌కు పెట్టింది పేరు..
భారత దేశంలోని తీర ప్రాంతాలు సీ ఫుడ్‌కు పెంచుగాంచాయి. మన దేశంలో సము్ర‘దపు ఆహారానికి సబంధించి ఐకానిక్‌ కూరలు ఉన్నాయి. రుచికరమైన సీఫుడ్‌ అందించడంలో అపారమైన నైపుణ్యం ఉంది. ఇవి ఎప్పుడూ బెస్ట్‌ సముద్రపు ఆహార వంటకాలుగా నిలుస్తాయి. పైగా ప్రజల మనసును దోచుకుంటాయి. ఈ క్రమంలో ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ తిలిసారి ప్రకటించిన 50 బెస్ట్‌ సీఫుడ్‌ జాబితాలో మన చేపల కూరకు చోటు కల్పించింది. టేస్ట్‌ అట్లాస్‌ గతంలో బెస్ట్‌ వెజ్‌ కర్రీ, బెస్ట్‌ స్వీట్స్, బెస్ట్‌ రెస్టారెంట్స్, బెస్ట్‌ బిర్యానీ వంటి జాబితాను ప్రకటించిది. ఇటీవల హైదరాబాద్‌ బిర్యానీ బెస్ట్‌ 10 ఫుడ్స్‌ జాబితాలో 6వ స్థానం దక్కింది. తాజాగా బెస్ట్‌ సీఫుడ్‌లో మన చేపల కూరకు 31వ స్థానం లభించింది.

తాజాగా జాబితా విడుదల..
బెస్ట్‌ సీ ఫుడ్స్‌కు సంబంధించి 50 రకాలతో టేస్టీ అట్లాస్‌ 2024, జూలైలో జాబితా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో మన బెంగాలీ రుచికరమైన వంటకం చింగ్రి మలై కర్రీకి 31 ర్యాంకు దక్కింది. ఇది మంచి ఘుమఘుమలాడే రొయ్యల కర్రీ. దీనిని కొబ్బరిపాలు, రొయ్యలు, గరం మసాలాలు, ఆవాల నూనెతో తయారు చేస్తారు. దీని తయారీలో వేడి మిరపకాయలు, వెల్లుల్లి వేయించాలి. అల్లం పేస్టు, దాల్చిన చెక్క, చక్కెర, ఏలకులు చేర్చి చిక్కటి గ్రేవీతో సర్వ్‌ చేస్తారు. చాలా ఓపికతో తయారు చేయాల్సిన సీఫుడ్‌ ఇది.