Homeక్రైమ్‌Valentine's Day Cyber Attack: నేడు ప్రేమికుల దినోత్సవం.. ఓయో రూంలకు వెళ్తున్నారా?

Valentine’s Day Cyber Attack: నేడు ప్రేమికుల దినోత్సవం.. ఓయో రూంలకు వెళ్తున్నారా?

Valentine’s Day Cyber Attack: ఒకప్పటి మాదిరిగా గులాబీ పూలు ఇచ్చే సంస్కృతి లేదు. చాక్లెట్లు పంచే ఆనవాయితీ లేదు. కానుకలు ఇచ్చే ఆచారం కూడా లేదు. మొత్తంగా శారీరక అవసరాలకే మొదటి ఓటు వేస్తున్నారు. అవకాశం దొరికితే చాలు “కలుసుకోవాలని” తాపత్రయపడుతున్నారు.

నేటి కాలంలో ప్రేమలు ఇలానే ఉన్నాయి. రహస్యంగా కలుసుకోవాలని.. తనువులు తనువులూ రాసుకోవాలని యువత తాపత్రయపడుతోంది. అందువల్లే ఏకాంతం కోసం వెంపర్లాడుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగానే అనేక సంస్థలు రకరకాల వ్యాపారాలు చేస్తున్నాయి. అందులో ఓయో కూడా ఒకటి. ఔత్సాహిక పారిశ్రామికవేత్త మదిలో మిగిలిన ఆలోచన ఓయో రూం ల ఏర్పాటుకు దారి తీసింది. అది కాస్త వేలకోట్ల వ్యాపారం లాగా మారిపోయింది.

ఓయో రూమ్ లను బుక్ చేసుకోవడం.. ఏకాంతాన్ని ఆస్వాదించడం ఇటీవల కాలంలో యువత ఒక అలవాటుగా మార్చుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజున ఇక చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది రూములను బుక్ చేసుకున్నారు. కేవలం స్వదేశంలోనే కాదు.. కొంతమంది విదేశాలలో కూడా రూమ్లను బుక్ చేసుకున్నారు. మరింత ఏకాంతం కోసం అక్కడికి వెళ్లి.. తనివి తీరా గడిపివస్తున్నారు.

మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ప్రేమికుల దినోత్సవం రోజు ఓయో రూమ్ లు బుక్ చేసుకోవాలని కొంతమంది లింకులు పంపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రేమికుల దినోత్సవం రోజున ఈసారి హోటల్ గదుల బుకింగ్స్ 170 శాతం వరకు పెరిగాయి. దీనిని కొంతమంది ఆసరాగా చేసుకొని ఓయూ ఆఫర్ల పేరుతో వల విసురుతున్నారు. రూమ్స్ బుకింగ్ స్పై డిస్కౌంట్ ప్రకటిస్తున్నారు. కొందరైతే కూపన్లు అంటూ సోషల్ మీడియాలలో లింకులు పెడుతున్నారు. వాటిని గనుక క్లిక్ చేస్తే అంతే సంగతులని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు అలా వల విసురుతున్నారని.. వారు చెప్పినట్టుగా వివరాలు నమోదు చేస్తే.. మొత్తానికి మోసం వస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ఇటీవల కాలంలో ప్రజలను మోసం చేయడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు.. ప్రత్యేక వేడుకల సమయంలో ఇటువంటి మోసపూరితమైన లింకులు పంపిస్తున్నారు. ఆ తర్వాత వాటిపై క్లిక్ చేస్తే చాలు.. సైబర్ నేరగాళ్లు ఎంటర్ అవుతారు. వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకొని.. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
Oktelugu Epaper
Exit mobile version