NATS: టీ20 వరల్డ్‌కప్ – 2024 ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు అభినందనలు, శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. జూన్ 29న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాప్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. వరల్డ్ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో భారత జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
నార్త్ అమెరికా తెలుగు సంఘం..
తాజాగా టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియాకు నార్త్ అమెరికా తెలుగు సంఘం(నాట్స్) శుభాకాంక్షలు తెలిపింది. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలుచుకోవడంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది. టీమిండియా విజయం తర్వాత నాట్స్ సంబరాల్లో మునిగిపోయింది. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇతర టీం సభ్యులకు నాట్స్ అభినందనలు తెలిపింది.
బౌలర్లకు శుభాకాంక్షలు..
ఇక ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా, హార్దిక్ పాండ్యాకు నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. బౌలర్లు అద్భుతంగా రాణించారని నాట్స్ కొనియాడింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో సంచలన క్యాచ్‌తో టీమిండియా గెలుపులో కీలకంగా మారిన సూర్యకుమార్ యాదవ్‌పై సైతం నాట్స్ పొగడ్తలతో ముంచెత్తింది. అతడి క్యాచ్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని నాట్స్ పేర్కొంది.