spot_img
Homeట్రెండింగ్ న్యూస్భారీ సైజులో గ్రహశకలం... భూమికి ప్రమాదమేనా..?

భారీ సైజులో గ్రహశకలం… భూమికి ప్రమాదమేనా..?

దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం యుగాంతం అంటూ వార్తలు వచ్చాయి. కొందరు ఆధారాలతో సహా యుగాంతం జరగబోతుందని వెల్లడించారు. అయితే అందరూ అనుకున్నట్టు అలా ఏం జరగలేదు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో యుగాంతం గురించి వార్తలు వచ్చినా ప్రజలు ఆ వార్తలను నమ్మడం, పట్టించుకోవడం మానేశారు. అయితే 2020 సంవత్సరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ప్రజలు యుగాంతం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు.

Also Read : పెళ్లైన పది రోజులకే భర్తను వదిలేసిన భార్య.. చివరకు..?

దేశంలో ఇప్పటికే కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. చైనాలో నమోదైన కేసుల మొత్తం భారత్ లో ఒక్కరోజే నమోదవుతూ ఉండటం గమనార్హం. అయితే దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున తరుణంలో వెలుగులోకి వస్తున్న కొత్త వార్తలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా వాషింగ్టన్ శాస్త్రవేత్తలు భారీ గ్రహ శకలం ఒకటి భూమి దారిలో ఉన్నట్లు గుర్తించారు.

కొందరు శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలం వల్ల ప్రమాదమని చెబుతుంటే మరి కొందరు మాత్రం ఈ గ్రహశకలం అంత ప్రమాదకరం కాదని తెలుపుతున్నారు. భూమికి 13వేల మైళ్ల లోతులో ప్రయాణించే ఈ గ్రహశకలం చాలా తక్కువ లోతులో ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమికి అత్యంత సమీపంగా ఆగ్నేయ పసిఫిక్‌ మహాసముద్రం ప్రాంతంలో ఈ గ్రహశకలం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

4.5 మీటర్ల నుండి 9 మీటర్ల పరిమాణం ఉన్న ఈ గ్రహశకలాన్ని చిన్న గ్రహశకలంగానే భావిస్తున్నామని.. ఇలాంటి గ్రహశకలాలు భూమిని తాకడం సర్వసాధారణమని తెలుపుతున్నారు. జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీకి చెందిన ప్రొఫెసర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక గ్రహశకలం ఖచ్చితంగా కాలిపోతుందని.. ఇప్పుడు భూమిని సమీపించిన గ్రహశకలం మరో 20 సంవత్సరాల తర్వాత భూమిని మరోసారి సమీపిస్తుందని తెలిపారు.

Also Read : తండ్రిని చంపిన వ్యక్తి కోసం 17 ఏళ్లుగా వెతుకుతున్న కొడుకు.. చివరకు..?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...
Oktelugu Epaper