Annu Kapoor- Priyanka Chopra: ప్రియాంక చోప్రా కెరీర్లో అనేక వివాదాలు ఉన్నాయి. 2011లో ఆమెకు నటుడు అన్ను కపూర్ తో మాటల యుద్ధం నడిచింది. అన్ను కపూర్ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో సాత్ కూన్ మాఫ్ టైటిల్ తో ఒక చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో అన్ను కపూర్ ఒక కీలక పాత్ర చేశారు. ప్రియాంక భర్తల్లో ఒకరిగా ఆయన నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో అన్ను కపూర్ ప్రియాంకను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారన్న ప్రచారం జరిగింది.
నేను అందంగా లేనని ప్రియాంక చోప్రా నాతో శృంగార సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడలేదు… అని అన్ను కపూర్ అన్నారట. ఇతర హీరోలతో అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పని ప్రియాంక నాతో మాత్రం చేయను అన్నారని అన్ను కపూర్ అన్నారట. అన్ను కపూర్ కామెంట్స్ ప్రియాంక దృష్టికి వెళ్లాయి. దాంతో అన్ను కపూర్ ఆరోపణలపై ప్రియాంక చోప్రా స్పందించారు.
ఆయనకు శృంగార సన్నివేశాల్లో నటించాలని ఉంటే ఆ తరహా చిత్రాల్లో నటించమనండి. ఇలాంటి ఛీప్ కామెంట్స్ చేయడం ఎందుకు. మా మూవీలో అసలు శృంగార సన్నివేశాలు లేవు. దిగజారుడు కామెంట్స్ చేయడం సరికాదు. ఆయన మాటలు నన్ను చాలా బాధపెట్టాయి…అని ప్రియాంక చోప్రా అన్నారు. ప్రియాంక కామెంట్స్ కి అన్ను కపూర్ రియాక్ట్ అయ్యారు. ప్రియాంక చోప్రాను తప్పుగా నేను ఒక్క మాట అనలేదు. ఆమె నాతో శృంగార సన్నివేశాల్లో నటించకపోతే నాకేం ఇబ్బంది. అది డైరెక్టర్-ప్రియాంక మధ్య సమస్య అవుతుంది. నేను ప్రియాంకకు ఇచ్చే సలహా ఒకటే… తల్లీ నువ్వు సీరియస్ కావద్దు. ఒత్తిడి తీసుకోవచ్చు. నువ్వొక అద్భుతమైన నటివి. గాడ్ బ్లెస్ యూ, అంటూ వివాదానికి ముగింపు పలికారు.
అన్ను కపూర్ సీనియర్ యాక్టర్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్నారు. రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నారు. ఒక సీనియర్ యాక్టర్ తో స్టార్ హీరోయిన్ వాగ్వాదం అప్పట్లో పతాక శీర్షికలకు ఎక్కింది. ప్రస్తుతం ప్రియాంక ఏకంగా బాలీవుడ్ కి గుడ్ బై చెప్పేశారు. ఆమె హాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నారు. ఇటీవల ఆమె బాలీవుడ్ ని ఉద్దేశిస్తూ దారుణ ఆరోపణలు చేశారు. ఇక్కడి రాజకీయాలకు ఇమడలేక పరిశ్రమను వదిలి వెళ్లిపోయానని వెల్లడించారు.