
Viral Auto: ఏడాది క్రితం యూపీలోని ఒక ఆటో డ్రైవర్ ఏకంగా తన సెవెన్ సీటర్ ఆటోలో చిన్నాపెద్దా అందరినీ కలిపి 27 మందిని ఎక్కించుకుని వెళుతుండగా పోలీసులు ఆపి షాకయ్యారు. తాజాగా అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ఆటోను మాత్రం ఎవరూ ఆప లేదు. ఓ మినీ బస్సులో పట్టేంత మందితో వేగంగా వెళ్తున్న ఆ ఆటోను ఆపితే మాత్రం 40 మందికి తక్కువ కాకుండా ఉంటారు.
మేఘాలలో దూసుకుపొమ్మన్నది అంటూ..
సాధారణంగా సెవెన్ సీటర్ షేరింగ్ ఆటోల్లో ఓ పది మందిని లేదా మరో ఇద్దరిని కలిపి 12 మందిని ఎక్కించుకిని డ్రైవర్లు వెళుతుంటారు. ఇక చిన్న ఆటోల్లో అయితే నలుగురిని ఎక్కించుకుని ముందో ఇద్దరు. డ్రైవర్‌తో కలిసి ఏడెనిమిది మంది ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఆటోలో మాత్రం 40 మందికి తక్కువ కాకుండా ఆటో వెనక ఓ 10 మంది. మధ్యలో ఓ పది మంది. ముందు ఓ ఎనిమిది మంది. పైన ఓ పది మంది చొప్పున వేసుకుని రయ్.. రయ్ మంటూ దసూకెళ్తోంది.

మామూలోడివి కాదురా బాబు..
ఇక ఇంత మందిని ఎక్కించుకుని ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్‌ను అయితే నెటిజన్లు ఓరి బాబూ నువ్వు మామూలోడివి కాదురా అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు పోలీసులూ ఎక్కడున్నార్రా అని ప్రశ్నిస్తున్నారు. వాడిని అలా వదిలేయకండి రా బాబూ అని కామెంట్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో చూసి అయినా పోలీసులు ఈ ఆటో వాలాను గుర్తిస్తారో లేదో చూడాలి.