
నలుపు డ్రెస్ లో తెల్లగా మెరుస్తున్న తెలుగందం ఆకట్టుకుంటోంది. అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ ఈ మధ్యసినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఇక మోడలింగ్ చేస్తూ ఓటీటీల్లో నటిస్తూ సోషల్ మీడియాలో తన ఫొటోషూట్ లను షేర్ చేసుకుంటోంది.
అందం, అభినయం ఉన్న నటి. స్టార్ హీరోయిన్‌కు కావాల్సిన అన్ని అర్హతలూ ఈషాకు ఉన్నాయి. కానీ, సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అయినా చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ కెరీర్ ను మలుపుతిప్పే బ్రేక్ కోసం ఈషా చాన్నాళ్ల నుంచి ఎదురు చూస్తూనే ఉంది.
తెలుగులో ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఓ పాత్ర పోషించింది. ఆ సినిమా హిట్టయినా.. ఈషాకు ఒరిగిందేమీ లేదు.
తాజాగా కరోనా రావడం.. సినిమాలు ఆగిపోవడంతోపాటు పెద్దగా సినీ అవకాశాలు లేకపోవడంతో ఇన్ స్టాగ్రామ్ లో సేదతీరుతోంది. షార్ట్ వేసుకొని.. చిన్న టాప్ తో బ్లాక్ డ్రెస్ లో ఆబగా ఎదురుచూస్తున్నట్టు ఈషారెబ్బ ఫోజుచ్చింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవిప్పుడు వైరల్ గా మారాయి.
ఇంత బ్లాక్ డ్రెస్ లో వైట్ ఫొటోలు చూసి అందాన్ని తెలుగు ఇండస్ట్రీ ఉపయోగించుకోవడం లేదని కామెంట్స్ వినపడుతున్నాయి.
https://www.instagram.com/p/CONVQlzMb_F/?utm_source=ig_web_copy_link