
అనన్య నాగళ్ల.. ఈ అచ్చ తెలంగాణ అందం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతిగా నటించిన ఈమె నటనకు ప్రశంసలు దక్కాయి. టాలీవుడ్ లో గుర్తింపు వచ్చింది. సినిమాల్లోనూ, పలు వెబ్ సిరీస్ లలోనూ ఆమెకు అవకాశాలు వచ్చిపడుతున్నాయి.
అయితే అనన్య మొదట షార్ట్ ఫిలింస్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి పాపులర్అయ్యింది. ఆ తర్వాత ‘మల్లేశం’ సినిమాలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మూడు సినిమాల తరువాత పవన్ కల్యాణ్ సినిమాలో నటించి మెప్పించింది. అవేవీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ పద్మశ్రీ అవార్డు గ్రహీత ‘మల్లేశం’ బయోపిక్ లో నటించిన అనన్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఆ తరువాత వకీల్ సాబ్ లో నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. తాజాగా అనన్యకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనన్య తెలంగాణ గ్రామీణ ప్రాంత యువతిలా.. అచ్చ తెలంగాణ యాసలో అలరిస్తుంటుంది. మల్లేశం సినిమాలో నటించేటప్పుడు ఆమె తీసుకున్న జాగ్రత్తలు తాజాగా సోషల్ మీడియా ప్రేక్షకులకు తెలిపింది. సినిమాలో కచ్చకాయలు ఆడే ఓ సీన్ ఉంటుంది. ఇప్పుడు అనన్య మళ్లీ కచ్చకాయాలు ఆడుతూ కొన్ని ఫొటో షూట్స్ చేసింది. ఆ ఫొటోలు నెట్టింట్లో పెట్టడంతో వైరల్ గా మారాయి.
‘మల్లేశం’ సినిమాలో హీరోయిన్ గా చేసినా ‘వకీల్ సాబ్’ మూవీలో గిరిజన యువతిగా సైడ్ రోల్ చేసింది ఈ ముద్దు గుమ్మ…పవన్ సినిమా కావడంతో ఆమెకు బాగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అనన్యకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలుస్తోంది..