https://oktelugu.com/

Namkeen: ప్రముఖ నమ్కీన్ ప్యాకేట్ లో చనిపోయిన ఎలుక..

గుజరాత్‌లో ప్రముఖ కంపెనీకి చెందిన నమ్‌కీన్ ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక కనిపించడంతో కలకలం రేగింది. ఆ అమ్మాయి హాయిగా స్నాక్స్ తింటోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 13, 2025 / 03:26 PM IST

    Namkeen

    Follow us on

    Namkeen: ప్రతి పదార్థం కూడా కల్తీ అవుతుంది. కల్తీ అని తెలుసుకునే లోపే అవి మన కడుపులో అరిగి, కరిగిపోతున్నాయి. కొన్ని సార్లు అవి పెద్ద పెద్ద సమస్యలను తీసుకొస్తున్నాయి. ఇక వాటి వల్ల కొందరు ఆస్పత్రుల పాలు అవడ, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం వంటివి కూడా జరుగుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఆహారం, ఇతర పదార్థాల్లో చనిపోయిన బొద్దింకలు, ఎలుకలు, బల్లులు, కీటకాలు వంటివి కూడా వస్తున్నాయి. అయితే మీలో చాలా మంది నమ్కీన్ తింటారా? అదేనండీ మిక్చర్, కారా అని ప్యాకెట్లు వస్తాయి కదా. అందులో ఓ చనిపోయిన ఎలుకు వచ్చింది. ఇంతకీ ఎక్కడ జరిగింది? మరి దీన్ని తిన్న వారి సంగతి ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    గుజరాత్‌లో ప్రముఖ కంపెనీకి చెందిన నమ్‌కీన్ ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక కనిపించడంతో కలకలం రేగింది. ఆ అమ్మాయి హాయిగా స్నాక్స్ తింటోంది. ఇంతలో చచ్చిపోయిన ఎలుక ఆ లోపల ఉండటం గమనించింది. ప్రస్తుతం డయేరియాతో బాధపడుతున్న ఆ అమ్మాయికి ఈ ఉప్పూ ఎక్కువేనని తేలిందని చెబుతున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంతలోని ప్రేమ్‌పూర్ గ్రామంలో నమోదైంది.

    బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య తన కుమార్తెకు ఓ ప్రముఖ కంపెనీకి చెందిన నమ్‌కీన్‌ ప్యాకెట్‌ తినిపిస్తోంది. అదే సందర్భంలో బాలిక అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడం ప్రారంభించిందట. అయితే ఆ తర్వాత ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుకను చూశారట. బాలిక అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం దావూద్ ఆసుపత్రిలో చేర్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నామ్‌కీన్‌ కంపెనీపై ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు డిమాండ్ చేశారు.

    గతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది
    ఇది మొదటి సంఘటన కాదు, ఇలాంటి వార్తలు చాలా సార్లు వెలుగులోకి వచ్చాయి. గతంలో కావేరీ జలాల వివాదంపై రైతులు పిలుపునిచ్చిన బంద్ సందర్భంగా కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిరసనల సందర్భంగా బందోబస్తులో ఉన్న పోలీసులకు అందించిన అల్పాహారంలో చనిపోయిన ఎలుక కనిపించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన 2023 సంవత్సరంలో చోటు చేసుకుంది.

    వినియోగించే ముందు చెక్ చేయండి
    ఇప్పటికే ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే మీరు మార్కెట్ నుంచి ఏదైనా కొనుగోలు చేసినప్పుడల్లా, దానిని వినియోగించే ముందు సాధ్యమైనంత వరకు ప్రతి వస్తువును, పదార్థాన్ని చెక్ చేసి తీసుకోవడం చాలా ముఖ్యం. తినే పదార్థాలు అయితే మరింత జాగ్రత్త అవసరం. మీరు లేదా మీ పిల్లలు తినే వస్తువులు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఒక చిన్న అజాగ్రత్త మీకు లేదా మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన సంఘటనను మిగులుస్తుంది అని గుర్తు పెట్టుకోండి.