https://oktelugu.com/

Sukumar and Dil Raju : సుకుమార్ చేసిన సినిమాల్లో దిల్ రాజుకి ఆ ఒక్క సినిమా నచ్చలేదట…ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. కానీ కొంతమందికి మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెస్ వస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : January 13, 2025 / 03:25 PM IST

    Dil Raju , Sukumar

    Follow us on

    Sukumar and Dil Raju : ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. కానీ కొంతమందికి మాత్రమే ఇక్కడ సూపర్ సక్సెస్ వస్తున్నాయి. మరికొందరు సక్సెస్ ఫుల్ సినిమాలను చేసినప్పటికి ఆ సక్సెస్ లను నిలబెట్టుకునే క్రమంలో కొంతవరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి… మరి ఇలాంటి సందర్భంలోనే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇప్పుడు పాన్ ఇండియాలో తన సత్తా చూపించుకుంటూ కొనసాగుతూ ఉండడం విశేషం…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్య సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలు పెట్టి ఆ మూవీతో మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్… తనదైన రీతిలో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ తో చేసిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను కూడా క్రియేట్ చేసి పెట్టింది. నిజానికి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఆయన లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ వస్తున్నాయి. సుకుమార్ తన మొదటి సినిమాని దిల్ రాజు బ్యానర్ లో చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆర్య సినిమా తర్వాత ఆయన జగడం అనే సినిమాని కూడా దిల్ రాజ్ బ్యానర్ లోనే చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల దిల్ రాజు ఆ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేయడంతో బయట వేరే ప్రొడ్యూసర్స్ తో ఆ సినిమాను చేసి భారీ డిజాస్టర్ ని ముడగట్టుకున్నాడు.

    అయితే అప్పటినుంచి ఇప్పటివరకు సుకుమార్ చాలా వరకు సక్సెస్ ఫుల్ సినిమాలను తీసినప్పటికి దిల్ రాజుకి మాత్రం సుకుమార్ విషయంలో కొంతవరకు కోపం ఉందట… ఆయన చేసిన జగడం సినిమా దిల్ రాజుకి నచ్చలేదట.

    దాని వల్లే సుకుమార్ చాలావరకు డౌన్ అయ్యాడు అంటూ కొన్ని సందర్భాల్లో దిల్ రాజు తెలియజేశాడు. మరి మొత్తానికైతే దిల్ రాజుని కాదని బయటికి వెళ్లి సుకుమార్ సక్సెస్ కొట్టలేకపోయాడనేది ఎంత వాస్తవమో జగడం సినిమా దిల్ రాజు కి నచ్చలేదు అనేది కూడా అంతే వాస్తవం అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరు టాప్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతుంటే, మరొకరు టాప్ డైరెక్టర్ గా పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు సాగుతుండటం విశేషం.

    మరి ఏది ఏమైనా వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంకా ముందు ముందు భారీ విజయాలను సాధిస్తూ పాన్ ఇండియాలో అద్భుతాలను క్రియేట్ చేయాలని సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…