Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Weather Alert March: ఎండలు మామూలుగా లేవు.. ఏపీలో ఆ జిల్లాలకు బిగ్...

Andhra Pradesh Weather Alert March: ఎండలు మామూలుగా లేవు.. ఏపీలో ఆ జిల్లాలకు బిగ్ అలెర్ట్!

Andhra Pradesh Weather Alert March: ఏపీలో( Andhra Pradesh) భానుడు ప్రతాపం చూపుతున్నాడు. సెగలు కక్కుతున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఏకంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం నాటికి రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేడి గాలులు వీయడంతో పాటు ఉక్కపోత అధికంగా ఉంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది ప్రజలకు. అయితే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది కూడా. మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి అంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అర్థమవుతోంది.

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

* రాయలసీమలో తీవ్రత..
ఎండల తీవ్రత సాధారణంగా రాయలసీమలోనే( Rayalaseema ) ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వేసవి ప్రారంభంలో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలు గా నమోదయింది. అమరావతి తో పాటు ఎన్టీఆర్, పల్నాడు, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాలో అయితే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి తో పాటు కాకినాడ జిల్లాల్లో సైతం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న కొద్ది రోజుల్లో రాయలసీమలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

* ప్రభుత్వం అప్రమత్తం..
మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని.. వేడి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇక వడగాలులకు సంబంధించి కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండలకు సంబంధించిన సమాచారం అందించేందుకు రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 అందుబాటులో ఉంచారు. ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఇకనుంచి ప్రజలకు ఫోన్ మెసేజ్ ల రూపంలో సైతం అప్రమత్తం చేస్తారు. మొత్తానికి అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version