Homeఅంతర్జాతీయంTrump Iran War Prophecy: జీసస్ కలలో కనిపించి చెప్పాడట.. ఇరాన్ పై ట్రంప్ యుద్ధం...

Trump Iran War Prophecy: జీసస్ కలలో కనిపించి చెప్పాడట.. ఇరాన్ పై ట్రంప్ యుద్ధం ప్రకటించాడట.. మరీ దారుణం సామీ

Trump Iran War Prophecy: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం భీకరంగా సాగుతోంది. సుప్రీం లీడర్‌ మరణించినా ఇరాన్‌ వెనక్కి తగ్గడం లేదు. ప్రతీకార దాడులతో గల్ఫ్‌ దేశాలను గడగడలాడిస్తోంది. ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తోంది. అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలను టార్గెట్‌ చేస్తోంది. మరోవైపు అమెరికా–ఇరాన్‌ కూడా దాడులు తీవ్రతరం చేశాయి. అయితే ఈదాడులకు అమెరికా సైనికులకు ధార్మిక సూత్రాన్ని రహస్యంగా బోధిస్తోంది. మిలిటరీ రిలీజియస్‌ ఫ్రీడమ్‌ ఫౌండేషన్‌ (MRFF) సైనికుల మత స్వేచ్ఛ కోసం పోరాటం చేసే సంస్థ. 40కి పైగా యూనిట్ల నుంచి 110 ఫిర్యాదులు స్వీకరించింది. ఇవి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో వ్యాపించాయి. ఒక కమాండర్‌ సైనికులకు ‘జీసస్‌ ట్రంప్‌కు అర్మాగెడ్డాన్‌ ప్రారంభించమని ఆదేశించాడు, కాబట్టి ఇరాన్‌పై దాడి మన ధర్మం‘ అని చెప్పినట్లు తెలిపారు. ఇలాంటి సమావేశాల్లో బైబిల్‌ భాగాలు పాఠాలు చేసి, యుద్ధాన్ని దైవిక కర్తవ్యంగా చిత్రీకరించారు.

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

మత సిద్ధాంతాల వివరాలు
అమెరికా ఫోకస్‌ ప్రధానంగా ఇరాన్, ఇరాక్, సిరియాలపై ఉంది. అర్మాగెడ్డాన్‌ను రెవెలేషన్‌ బుక్‌లోని అంతిమ యుద్ధంగా వర్ణించి, ముస్లిం దేశాలపై దాడిని ‘చెడును ఓడించడం‘గా ప్రచారం చేశారు. ట్రంప్‌కు వచ్చిన ‘దైవిక సందేశాలు‘ ద్వారా ఈ చర్యలు సమర్థనీయమని కమాండర్లు ప్రబోధం చేశారట.

పెంటగాన్‌ దర్యాప్తు..
ఈ ప్రచారంపై పెంటగాన్‌ దర్యాప్తు ప్రారంభించింది, కానీ అధికారిక పేర్కొన్నది లేదు. MRFF తరఫున మిక్కీ వెయిస్‌మాన్‌ ‘ఇది రాజ్యాంగ విరుద్ధం‘ అని హెచ్చరించారు. డెమొక్రటిక్‌ నాయకులు కాంగ్రెస్‌ విచారణ డిమాండ్‌ చేశారు. రిపబ్లికన్లు ‘వ్యక్తిగత విశ్వాసాలు‘గా తీసుకుని తిప్పికొట్టారు.

సైనిక ఐక్యతకు సవాల్‌..
సైనికుల మధ్య మత విభేదాలు పెరిగి, మానసిక ఒత్తిడి, డిజర్షన్లు పెరిగే ప్రమాదం ఉంది. అంతర్జాతీయంగా, ఇస్లామిక్‌ దేశాలు ‘మత యుద్ధం‘గా చూసి, ఉగ్రవాదానికి ఇది ఆధారం అవుతుంది. ఇరాన్‌ మీడియా ఇప్పటికే దీన్ని ప్రచారం చేస్తోంది.

అమెరికా సైన్యంలో మత ప్రభావం కొత్తది కాదు. 2003 ఇరాక్‌ యుద్ధంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఎవాంజెలికల్‌ గ్రూపులు పెరగడంతో ఈ ట్రెండ్‌ బలపడింది. రాజకీయంగా, ట్రంప్‌ మద్దతుదారులకు ఇది సౌకర్యం, కానీ లౌకిక సూత్రాలకు ముప్పు. దీర్ఘకాలంలో, సైనిక శిక్షణల్లో మత నిషేధాలు బలపడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version