https://oktelugu.com/

Balayya Babu : బాలయ్య బాబు వరుసగా నాల్గోవ సక్సెస్ కొట్టడం వెనక అసలు కారణం ఇదేనా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది లెజెండరీ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 13, 2025 / 03:30 PM IST

    Balayya Babu

    Follow us on

    Balayya Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది లెజెండరీ హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో సైతం తను చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించడానికి రెడీ అవుతున్నాడు… మరి ఏది ఏమైనా కూడా తను చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్న బాలయ్య ఇకమీదట కూడా భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…

    ‘నందమూరి తారక రామారావు’ గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య మొదట్లో వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ రావడమే కాకుండా మాస్ లో మంచి ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్న హీరోగా పేరు ప్రఖ్యాతలనైతే సంపాదించుకున్నాడు. మరి ఏది ఏమైనా కూడా వాళ్ళ నాన్న అయిన నందమూరి తారక రామారావు గారు సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ బాధ్యతలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు మొదటి నుంచి కూడా స్టోరీ సెలెక్షన్ లో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేవాడు. అయితే కొన్ని సంవత్సరాల పాటు అతనికి భారీగా ఫ్లాప్ లు అయితే వచ్చాయి. ఇక బాలయ్య పని అయిపోయింది. ఆయన సినిమాలను ఎవరు చూడరు. ఇక మీదట ఆయన చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవుతాయంటూ చాలామంది అతన్ని హేళన చేశారు. కానీ ఎట్టకేలకు బోయపాటి శ్రీను తో చేసిన సింహా సినిమాతో మరోసారి కంబ్యాక్ ఇఛాడు.

    ఇక ఆయన కొన్ని సంవత్సరాల నుంచి మంచి విజయాలను సాధిస్తూ రావడమే కాకుండా ఇప్పటికి ఆయన చేస్తున్న సినిమాల కోసం యావత్ తెలుగు ప్రేక్షకులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే ఆయన ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాతో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

    నిజానికి బాలయ్య బాబు స్క్రిప్ట్ సెలక్షన్ అనేది ఇప్పుడు చాలా బాగుంటుంది. తన చిన్న కూతురు అయిన తేజస్విని బాలయ్య బాబుకు సంబంధించిన స్క్రిప్ట్ సెలక్షన్ పనులను చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటికే అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని హ్యట్రిక్ విజయాలను నమోదు చేశాడు.

    ఇక ఈ సంక్రాంతి కానుక గా వచ్చిన ‘డాకు మహారాజ్’ సినిమాతో మరొక సక్సెస్ ని సాధించి రెండోవ హ్యట్రిక్ విజయాలను అందుకునే విధంగా నాలుగో సక్సెస్ కి పునాదిని అయితే వేశాడు. మరి తాను చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్న బాలయ్య బాబు ఈ సక్సెస్ లను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఇక మీదట వచ్చే సినిమాలతో ఆయన ఏంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…