Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda Rashmika Wedding Reception: విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ కి స్టార్...

Vijay Devarakonda Rashmika Wedding Reception: విజయ్ దేవరకొండ, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ కి స్టార్ హీరోలు డుమ్మా..కారణం ఇదేనా ?

Vijay Devarakonda Rashmika Wedding Reception: ఇటీవలే ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) జంట , నిన్న హైదరాబాద్ లోని బంజారా హిల్స్, తాజ్ బంజారా హోటల్ లో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ని జరుపుకున్నారు. ఈ ఈవెంట్ కి సినీ సెలబ్రిటీలు దాదాపుగా అందరూ హాజరయ్యారు కానీ, కొంతమంది మాత్రం మిస్ అయ్యారు. ముఖ్యంగా స్టార్ హీరోల్లో కేవలం రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రమే ఈ రిసెప్షన్ కి హాజరయ్యారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ వంటి వారు ఈ రిసెప్షన్ కి రాలేదు. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద చర్చ సాగుతోంది. విజయ్ దేవరకొండ వాళ్ళని పిలవలేదా?, పిలిచినప్పటికీ వాళ్ళు రాలేకపోయారా ?, అసలు ఏమైంది? నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

అయితే విజయ్ దేవరకొండ అందరినీ ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించాడని, కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరు కాలేకపోయారని అంటున్నారు . సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి ‘ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ కోసం జార్జియా కి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఆయన ఈ రిసెప్షన్ కి రాలేకపోయాడు. కానీ ఆయనకు బదులుగా నమ్రత శిరోడ్కర్, సితార విచ్చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సంగతి తెలిసిందే. సొంత కుటుంబ సభ్యుల ఫంక్షన్స్ లోనే ఆయన్ని మనం చూడలేం, ఇక ఇలాంటి ఫంక్షన్స్ లో ఎక్కడ కనిపిస్తాడు చెప్పండి. పైగా ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ ఈవెంట్ కి రాలేకపోయాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ బిజీ గా వేరే దేశం లో ఉండడం లో వల్ల రాలేకపోయాడని టాక్ .

ఇక ప్రభాస్ సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ మరియు రామ్ చరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పెళ్లీల్లో తప్ప , ఎక్కడా కనిపించలేదు. ఇలాంటి ఈవెంట్స్ కి రావటానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపించడు. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే, స్టార్ హీరోయిన్లు కూడా ఈ ఈవెంట్ కి రాలేదు. సమంత తో విజయ్ దేవరకొండ, రష్మిక లకు మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ ఆమె ఎందుకు రాలేదో మిస్టరీ నే. అదే విధంగా తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి వారు కూడా రాలేదు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కూడా బాలీవుడ్ లో ఫేమస్ , కాబట్టి అక్కడి నుండి కూడా సెలబ్రిటీలు భారీగా ఈ ఈవెంట్ కి వస్తారని అనుకున్నారు. కానీ కేవలం కృతి సనన్, కరణ్ జోహార్ వంటి వారు మాత్రమే రావడం గమనార్హం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version