Homeట్రెండింగ్ న్యూస్Viral Marriage: 40 ఏళ్ల వ్యక్తి.. 20 ఏళ్ల లేత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. తర్వాత...

Viral Marriage: 40 ఏళ్ల వ్యక్తి.. 20 ఏళ్ల లేత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. తర్వాత ఏమైందంటే?

Viral Marriage
Viral Marriage

Viral Marriage: వివాహ బంధంలో వయసుకు ప్రాధాన్యం ఇస్తారు. శ్రీరాముని కన్నా సీత వయసులో పెద్ద అంటారు, సచిన్‌ కంటే ఆయన భార్య అంజలీ ఐదేళ్లు పెద్ద. ఇలాంటి వారిని ఉదాహరణగా చెప్పి మంది తమకంటే వయసులో పెద్ద అయిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. అలాగే.. తమ కూతురు వయసు ఉన్న అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకున్న పురుషులు కూడా ఉన్నారు. పెద్ద సినిమా స్టార్లు, నేతలు కూడా వివిధ కారణాలతో తక్కువ వయసు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. భార్య పెద్దది అయినా.. భర్త ఏజ్‌ బార్‌ అయినా… అర్థం చేసుకుంటే నో ప్రాబ్లం అంటోంది నేటితరం. వయస్సు అనేది జస్ట్‌ నంబర్‌ మాత్రమే అటున్నారు.

వయసుకే ప్రాధాన్యం..
సాధారణంగా వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన కార్యం. ఇక పెళ్లి గురించి యువతీ, యువకులు అనేక కలలుకంటారు. ఇక పెద్దవాళ్లు అమ్మాయి, అబ్బాయిల పెళ్లికి అన్నిటితో పాటుగా ఏజ్‌ గ్యాప్‌ ను కూడా ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఐదు సంవత్సరాలు ఉండాలని అంటారు. అంతకన్నా ఎక్కువ అయితే ఇద్దరి అభిరుచుల్లో, ఆలోచనల్లో, అలవాట్లలోనూ తేడాలు వస్తాయని, దాంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి, విడిపోయే అవకాశాలు ఉంటాయని అంటారు.

Viral Marriage
Viral Marriage

జస్ట్‌ నంబర్‌ మాత్రమే..
అయితే ఇక్కడ ఒకతను పెళ్లికి వయసుతో పని లేదని, అది ఒక నంబర్‌ మాత్రమే అని చెప్తున్నాడు ఓ వ్యక్తి. తన వయసు 40 ఏళ్లు, తన భార్యకు 20 ఏళ్లు. అంటే ఇద్దరి మధ్య 20 ఏళ్ల వయసు గ్యాప్‌ ఉంది. అయినా తాము చాలా హ్యాపీగా ఉన్నాం అంటున్నాడు. తాము ఒకరినొకరం అర్థం చేసుకుంటామని, ఒకరి అభిప్రాయాన్ని మరోకరం గౌరవించుకుంటూ సంతోషంగా జీవిస్తున్నామని చెబుతన్నాడు. తన భార్య వయస్సులో చిన్న అయినా, ఆలోచనలో, అణకువలో, అర్థం చేసుకోవడంలో తాను ముందుంటుందని పేర్కొంటున్నాడు. తన నాన్‌ వెజ్‌ నచ్చదు. కానీ ఆమెకు నాన్‌ వెజ్‌ ఇష్టం. అయినా తన కోసం నాన్‌ వెజ్‌ మానేసిందని హ్యాపీగా వెల్లడిస్తున్నాడు. ఇంకా తనకు డ్రెస్‌ వేసుకోవడం ఇష్టం ఉన్నా, ఏజ్‌ గ్యాప్‌ తెలియనియకుండా చీరలు కట్టుకుంటుంది అని చెబుతున్నాడు. తాను ఇల్లు చిందరవందరగా చేస్తే, ఆమె నీట్‌ గా చేస్తూ ఉంటుంది. తాను ఫిట్‌గా ఉండడం కోసం జిమ్‌ చేయడం అలవాటు, తనకు సపోర్ట్‌ చేస్తుంది.

అన్ని విషయాల్లో అర్థం చేసుకునే మనస్సు ఉంటే.. దంపతుల మధ్య వయస్సు అనేది పెద్ద సమస్యే కాదు అంటున్నాడు. వయస్సు అనేది తమ దృష్టిలో ఒక నంబర్‌ మాత్రమే అని చెబుతున్నాడు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular