Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli Angry Reaction Vs Mi 2026: గ్లౌజ్ లు విసిరేశాడు.. హెల్మెట్ నేలకేసి...

Virat Kohli Angry Reaction Vs Mi 2026: గ్లౌజ్ లు విసిరేశాడు.. హెల్మెట్ నేలకేసి కొట్టాడు.. విరాట్ కు అంత కోపమెందుకు..

Virat Kohli Angry Reaction Vs Mi 2026: ముంబై జట్టు(RCB vs MI) తో ఆదివారం వాంఖడే మైదానంలో బెంగళూరు తలపడింది. ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో పాటిదర్ సేన విజయం సాధించింది. తద్వారా ఇటీవలి ఓటమి నుంచి బెంగళూరు త్వరగానే బౌన్స్ బ్యాక్ అయింది. బెంగళూరు జట్టులో సాల్ట్, పాటిధార్, విరాట్ అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సాల్ట్, విరాట్ తొలి వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ […]

Virat Kohli Angry Reaction Vs Mi 2026: ముంబై జట్టు(RCB vs MI) తో ఆదివారం వాంఖడే మైదానంలో బెంగళూరు తలపడింది. ఈ మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో పాటిదర్ సేన విజయం సాధించింది. తద్వారా ఇటీవలి ఓటమి నుంచి బెంగళూరు త్వరగానే బౌన్స్ బ్యాక్ అయింది.

బెంగళూరు జట్టులో సాల్ట్, పాటిధార్, విరాట్ అర్థ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సాల్ట్, విరాట్ తొలి వికెట్ కు 120 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ తెలివిగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. ముంబై బౌలర్ల పై సంపూర్ణ ఆధిపత్యాన్ని కొనసాగించారు. సాల్ట్ మెరుపు వేగంతో పరుగులు తీశాడు. చివర్లో డేవిడ్ విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. తద్వారా ముంబై ఇండియన్స్ జట్టుపై బెంగళూరు 240/4 పరుగులు చేసింది. సాల్ట్ 36 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. విరాట్ 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. చివర్లో డేవిడ్ 16 బంతుల్లోనే అజేయంగా 34 పరుగులు చేశాడు.

బెంగళూరు విధించిన భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. ముంబై ఇండియన్స్ జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. అయితే ఆ జట్టు ఇన్నింగ్స్ 222/5 వద్ద ముగిసింది. దీంతో ముంబై జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్ సుయాష్ శర్మ 8 ఓవర్లో రెండు వికెట్లు తీసి ముంబై జట్టుకు షాక్ ఇచ్చాడు. అయితే బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ అవుట్ కావడం చర్చకు దారి తీసింది. ఈ సీజన్లో రెండవ అర్థశతకాన్ని చేసిన కోహ్లీ.. పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు.

అవుట్ అయిన తర్వాత పెవిలియన్ కు వెళ్తున్నప్పుడు విరాట్ కోహ్లీ తీవ్రమైన నిరాశతో కనిపించాడు.. విపరీతమైన ఆగ్రహంతో హెల్మెట్, గ్లౌజ్ లను కోపంతో విసిరేశాడు. సాల్ట్ నుంచి సహకారం లభించినప్పటికీ.. తాను కేవలం హాఫ్ సెంచరీ వద్ద ఆగిపోవడంతో విరాట్ కోహ్లీకి కోపం తెప్పించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఇంత కోపంగా ఉండడం ఇదే తొలిసారి అని అభిమానులు చెబుతున్నారు. మరోవైపు బెంగళూరు ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడింది. అందులో మూడు విజయాలు సాధించింది. ఈ విజయం ద్వారా పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది . బెంగళూరు జట్టు ఏప్రిల్ 15న లక్నోతో తలపడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper