Homeక్రైమ్‌Singer Mangli Controversies: సింగర్ మంగ్లీ.. గ్రహచారం బాగా లేనట్టుంది.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ వివాదమే

Singer Mangli Controversies: సింగర్ మంగ్లీ.. గ్రహచారం బాగా లేనట్టుంది.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ వివాదమే

Singer Mangli Controversies: కొంతమందికి ఫేమ్ వచ్చిన తర్వాత దానిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మరికొందరేమో అడ్డగోలుగా అడుగులు వేసి పరువు తీసుకుంటారు. ఈ జాబితాలో సింగర్ మంగ్లీ ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె పేరు మార్మోగినట్టు మరో సెలబ్రిటీ పేరు మారుమోగలేదంటే ఆమె ఎన్ని వివాదాలలో చిక్కుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య తన పుట్టినరోజు పార్టీ జరిగినప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎస్ఓటి పోలీసులు దాడులు […]

Singer Mangli Controversies: కొంతమందికి ఫేమ్ వచ్చిన తర్వాత దానిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మరికొందరేమో అడ్డగోలుగా అడుగులు వేసి పరువు తీసుకుంటారు. ఈ జాబితాలో సింగర్ మంగ్లీ ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఆమె పేరు మార్మోగినట్టు మరో సెలబ్రిటీ పేరు మారుమోగలేదంటే ఆమె ఎన్ని వివాదాలలో చిక్కుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఆ మధ్య తన పుట్టినరోజు పార్టీ జరిగినప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎస్ఓటి పోలీసులు దాడులు కూడా చేశారు. కొన్ని శాంపిల్స్ సేకరించారు. ఆ తర్వాత మంగ్లీ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. అందులో చెప్పడం జరిగింది.. తీసుకోవడం జరిగింది అనే మాటలు తప్ప.. అధికారికంగా మంగ్లీ క్లారిటీ ఇవ్వలేదు. ఇచ్చిన స్క్రిప్ట్ పాఠం లాగా చదివింది అంతే. ఈ కేసు ఇప్పటికీ విచారణలో ఉంది.

దీనికంటే ముందు బావిలోనే బల్లి పలికే అనే పాట వివాదంలో చిక్కుకుంది. ఓ భాషలో పాపులర్ అయిన పాటను మక్కికి మక్కి దించారని.. చివరికి ట్యూన్స్ కూడా అవే వాడారని ఆరోపణలు వినిపించాయి. దీనిపై మంగ్లీ స్పందించలేదు. సోషల్ మీడియాలో ఇప్పటికి ఈ పాట గురించి చర్చ జరుగుతూనే ఉంది..

ఇటీవల కాలంలో బాలీవుడ్ లో ఓ సినిమా పాట పాడిన మంగ్లీ.. తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. ఆ పాటను ఆ చిత్రం నుంచి తొలగించారు. మంగ్లీ క్షమాపణలు కూడా చెప్పింది. ఇప్పటికీ ఈ పాట సంబంధించిన కేసు జాతీయ మహిళా కమిషన్ విచారణ పరిధిలో ఉంది.

ఇవన్నీ జరిగిన తర్వాత మంగ్లీ కొద్దిరోజులుగా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు ఆమె పేరు మళ్లీ మీడియాలో వినిపిస్తోంది. పైగా మంగ్లీ, ఆమె సోదరుడు శివ దర్శకుడు వేణు ఊడుగుల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మైక్రో ఫైనాన్స్ పేరుతో.. అధిక వడ్డీ.. లాభాలు ఇస్తామని మంగ్లీ, శివ, వేణు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారట. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చినవారు తిరిగి ఇవ్వాలని కోరితే దౌర్జన్యానికి దిగుతున్నారట. అంతేకాదు ఓ న్యాయవాదిని కారుతో గుద్ధి చంపుతామని బెదిరిస్తున్నారట. దీంతో అతడు వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. పంజా గుట్ట పోలీసులు మంగ్లీ, ఆమె సోదరుడు, దర్శకుడు వేణు మీద కేసులు నమోదు చేశారు.

ఇక అప్పట్లో శ్రీకాళహస్తి గుడిలో మంగ్లీ తన ప్రైవేట్ పాట కోసం షూట్ నిర్వహించింది. దీనిపై రకరకాలుగా విమర్శలు వినిపించాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంగ్లీ ఓ నామినేటెడ్ పదవిలో ఉంది. అప్పట్లో వైసిపి అధికారంలో ఉంది కాబట్టి శ్రీకాళహస్తిలో ఆమెకు పాట షూట్ చేసుకునే అవకాశం వచ్చిందని విమర్శలు వినిపించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మంగ్లీ మీద ఎన్నో ఆరోపణలు.. ఎన్నో విమర్శలు. సెలబ్రిటీ అయిన తర్వాత వాళ్ళు ఏమైనా మానవాతీతులా.. ఈ ప్రశ్నకు మంగ్లీ కచ్చితంగా సమాధానం చెప్పాలి

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper